హైలైట్స్:
- భారత్ లో లాంచ్ అయిన ఐకూ 9టీ స్మార్ట్ ఫోన్
- స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఐకూ 9టీ లో ప్రధాన ఫీచర్లు
- భారత్ లో రూ.49,999 నుంచి ఐకూ 9టీ ధర ప్రారంభం
ఐకూ 9 సిరీస్ లో భాగంగా ఈ ఏడాది మొదట్లో ఐకూ 9, ఐకూ 9 ప్రో, ఐకూ 9ఎస్ఈ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐకూ 9టీ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. గత నెలలో చైనాలో లాంచ్ అయిన ఐకూ 10 యొక్క రీబ్రాండ్ వర్షన్ గా ఐకూ 9టీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ హ్యాండ్సెట్ బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ టోన్ డిజైన్ కలిగి ఉంది. కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ ప్రీమియమ్ లుక్ ని ఇచ్చింది. సెల్ఫీ స్నాపర్ కోసం పంచ్ హోల్ కటౌట్ ఉంది. ఐకూ 9టీ లో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. అలాగే ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.
స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ ఓఎస్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 16ఎంపి సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
భారత్ లో iQOO 9T ప్రైస్, సేల్ డేట్
ఐకూ 9టీ 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.49,999, 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.54,999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో వారికి ఫోన్ ధర రూ.45,999/రూ.50,999 కి తగ్గిపోనుంది. మీరు ప్రస్తుతం వాడుతోన్న ఐకూ ఫోన్ ని ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా రూ.7000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఇతర ఫోన్స్ ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.5,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే 12 నెలల కాలపరిమితి కలిగిన నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. హ్యాండ్సెట్ నేటి నుంచి సేల్ కి వచ్చింది. ఐకూ వెబ్ సైట్ ద్వారా నేటి నుంచి ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 4 నుంచి ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.
iQOO 9T స్పెసిఫికేషన్స్
6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, హెచ్డీఆర్ 10+, పంచ్ హోల్ కటౌట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఒరిజిన్ ఓషన్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఐకూ 9టీ లో ఉన్నాయి.
ఇక కెమెరా విభాగానికి వస్తే, ఐకూ 9టీ లో వెనకాల మూడు కెమెరాలను అమర్చారు. ఇందులో ఒకటి 50ఎంపి శాంసంగ్ జీఎన్5 ప్రైమరీ సెన్సర్ (గింబల్-లైక్ స్టెబిలైజేషన్) కాగా, రెండోది 13ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, మూడోది 12ఎంపి పోట్రెయిట్ సెన్సర్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపున 16ఎంపి కెమెరాను అమర్చారు.
ఇప్పుడు బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. ఐకూ 9టీ లో 4,700 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, హై-ఫై ఆడియో, 3.5 ఎంఎం ఆడియో జాక్, 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.












