
భారత్ లో వచ్చే వారం iQOO Neo 7 5G లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఫిబ్రవరి 16 న iQOO Neo 7 5G ని లాంచ్ చేయబోతున్నట్లు ఐకూ సంస్థ అధికారికంగా ప్రకటించింది. చైనీస్ మోడల్ iQOO Neo 7 SE 5G కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా iQOO Neo 7 5G భారత మార్కెట్ లోకి వస్తోంది. iQOO Neo 7 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో రానున్నట్లు లీకైన వివరాల ద్వారా తెలుస్తోంది. అలాగే అప్‌గ్రేడెడ్ బ్యాటరీ మరియు చార్జింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ వస్తోందట.
ఫిబ్రవరి 16 న iQOO Neo 7 5G ఫోన్ యొక్క ధర, సేల్ తేదీని కంపెనీ ప్రకటించనుంది. అయితే తాజాగా ఓ లీక్ ద్వారా ఫోన్ కి సంబంధించిన ధర, ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి.
భారత్ లో ఐకూ నియో 7 5జీ ధర, సేల్ వివరాలు (లీక్డ్)
iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ Neo 6 5G కి సక్సెసర్ గా వస్తోంది. iQOO Neo 7 5G రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో రానున్నట్లు సమాచారం. బేస్ మోడల్ అయిన 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తోంది. ఇక టాప్ మోడల్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వస్తోంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇకపోతే టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్ మోడల్ రూ.34,999 ధరతో లాంచ్ కానుందని ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని తెలిపాడు.
రూ.4,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ తో iQOO Neo 7 5G లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ చెప్పాడు. ఈ ఆఫర్ బ్యాంక్ మరియు ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో కలుపుకుని వర్తిస్తుందని అతడు తెలిపాడు. అంటే అన్ని ఆఫర్లు పోనూ iQOO Neo 7 5G ఫోన్ రూ.30,999 కి లభించనుంది. టిప్‌స్టర్ 8జిబి + 128జిబి వేరియంట్ ధర వెల్లడించలేదు.
అయితే ఫిబ్రవరి 19 లేదా 20 వ తేదీన భారత్ లో iQOO Neo 7 5G సేల్ మొదలవుతుందని గుగ్లాని తెలిపాడు. అమెజాన్, ఐకూ ఈ-స్టోర్, వివో ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా iQOO Neo 7 5G ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఇంటెస్టెల్లార్ బ్లాక్, ఫ్రాస్ట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
ఐకూ నియో 7 5జీ స్పెసిఫికేషన్స్ (లీక్డ్)
ఇప్పటి వరకు రివీల్ అయిన లీక్స్ ని బట్టి, iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8200 చిప్సెట్ తో రానుందని స్పష్టమైంది. ఇక పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. అలాగే 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తోంది. iQOO Neo 7 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, ఫ్లాట్ స్క్రీన్, సెంటర్ హోల్ పంచ్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి తోడు 2ఎంపి మ్యాక్రో సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











