హైలైట్స్
- నవంబర్ 17 న చైనాలో లాంచ్ కానున్న Realme 10 Pro సిరీస్
- లైనప్ లో వస్తోన్న Realme 10 Pro, Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్స్
- లాంచ్ కి ముందు బయటకు వచ్చిన Realme 10 Pro+ 5G ప్రోమో వీడియో
Realme 10 Pro సిరీస్ ని లాంచ్ చేసేందుకు రియల్మీ సిద్ధమవుతోంది. నవంబర్ 17 న చైనాలో Realme 10 Pro+ 5G లాంచ్ అవ్వనుంది. దీంతో పాటు Realme Buds Air 3S కూడా లాంచ్ అవుతోంది. లాంచ్ కి ముందు Realme 10 Pro+ 5G యొక్క ప్రోమో వీడియో ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. దీంతో డివైజ్ డిజైన్ ఎలా ఉండనుందో స్పష్టత వచ్చింది. మీరు కూడా ఓ లుక్ వేయండి.
రివీల్ అయిన Realme 10 Pro+ 5G డిజైన్
పైన వీడియోలో చూపిన విధంగా Realme 10 Pro+ 5G ఫోన్ ఉండనుంది. ఫోన్ కి టాప్ లో సెకండరీ మైక్రోఫోన్ మరియు స్పీకర్ గ్రిల్ ఉంటుంది. బాటమ్ లో సిమ్ ట్రే, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ కనిపిస్తున్నాయి. ఫోన్ కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఉన్నాయి. ఎడమవైపున ఏమీ లేవు.
డిస్ప్లే విషయానికి వస్తే, Realme 10 Pro+ 5G లో కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, మినిమల్ బెజెల్స్ ఉన్నాయి. డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. Realme 10 Pro+ 5G లో సెల్ఫీ కెమెరా కోసం సెంట్రల్లీ-అలైన్డ్ పంచ్-హోల్ కటౌట్ ఉంది.
Realme 10 Pro+ 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 61-డిగ్రీ స్క్రీన్ కర్వేచర్ ఉంటాయని అంచనా. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో వస్తోంది. అలాగే ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉండనున్నాయి.
Realme 10 Pro+ 5G ఆండ్రాయిడ్ 13 ఆధారిత, రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Realme 10 Pro+ 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ కోసం ఇందులో యూఎస్బీ టైప్ సీ పోర్ట్ అందించారు. Realme 10 Pro+ 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 Pro+ 5G లో 108ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు.
Realme 10 Pro 5G స్పెసిఫికేషన్స్
Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, ఇది 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో రానుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ వాడారు. ఈ డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభ్యమవుతుంది. Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ 163.69 మిల్లీ మీటర్లు పొడవు, 74.18 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.12 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ ని ఇందులో వాడే అవకాశం ఉంది.
Realme 10 Pro 5G లో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2 ఎంపి మ్యాక్రో లెన్స్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 64ఎంపి మెయిన్ కెమెరా పిక్సెల్ బైనింగ్ తర్వాత 16ఎంపి రెజుల్యూషన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే స్పెసిఫికేషన్స్ లిస్ట్ లో రియర్ కెమెరా 16ఎంపి గా చెప్పబడింది. అయితే అది పిక్సెల్ బైనింగ్ రెజుల్యూషన్ అని గమనించాలి. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












