24GB ర్యామ్ తో వస్తోన్న iQOO Neo 7S రేసింగ్ ఎడిషన్

హైలైట్స్

  • లాంచ్‌ కి ముందు లీకైన iQOO Neo 7S రేసింగ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, ఓఐఎస్ కెమెరా తదితర స్పెసిఫికేషన్స్ తో వస్తున్న iQOO Neo 7S Racing Edition
  • లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనున్న iQOO Neo 7S స్మార్ట్ ఫోన్

iQOO కంపెనీ వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తోంది. వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ అన్ని సెగ్మెంట్స్ లో ఫోన్లను దింపుతూ యూజర్లను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సంస్థ iQOO Neo 7S మరియు iQOO Neo 7SE ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పుడు టిప్‌స్టర్ ముకుల్ శర్మ ప్రకారం, iQOO Neo 7S రేసింగ్ ఎడిషన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, వర్చువల్ ర్యామ్ తో వస్తోంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

ఐకూ కంపెనీ రీసెంట్ గా తన ఫ్లాగ్షిప్ సిరీస్ ఐకూ 11 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇక భారత్ లో ఈ సిరీస్ జనవరి 10 న లాంచ్ అవుతోంది. అయితే, iQOO 11 Pro లాంచ్ మాత్రం ఇండియాలో ఇప్పుడప్పుడే ఉండదని సమాచారం.

iQOO Neo 7S రేసింగ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ సోషల్ మీడియా ద్వారా iQOO Neo 7S యొక్క స్పెసిఫికేషన్స్ ని లీక్ చేశాడు. ఆ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. iQOO Neo 7S లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే ఉంటాయి. ఇక ఈ డివైజ్ లో క్వాల్కమ్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 వాడినట్లు సమాచారం. 16జిబి వరకు ర్యామ్, 8జిబి వర్చువర్ ర్యామ్ ఈ ఫోన్ లో అందిస్తున్నారు. అంటే యూజర్ కి మొత్తం 24జిబి ర్యామ్ లభిస్తుంది. ఇక 512జిబి వరకు స్టోరేజీని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

iQOO Neo 7S కెమెరా విభాగానికి సంబంధించిన లెన్సెస్ వివరాలు తెలియలేదు. అయితే ఓఐఎస్ తో కూడిన రియర్ కెమెరా సిస్టమ్ ఉంటుందని తెలుస్తోంది. iQOO Neo 7S రేసింగ్ ఎడిషన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

iQOO Neo 7S యొక్క బ్యాటరీ విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. iQOO Neo 7S లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఈ డివైజ్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే భారత్ లో ఈ డివైజ్ లాంచ్ అవుతుందో లేదో అనే విషయం కూడా తెలియనుంది. ఐకూ సంస్థకి భారత్ లో మంచి మార్కెట్ ఉంది కాబట్టి, కచ్చితంగా ఈ మోడల్స్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleDimensity 810 చిప్, 5000mAh బ్యాటరీతో లాంచైన Realme 10S 5G
Next articleభారత్ లో లాంచైన చవకైన స్మార్ట్ ఫోన్ Lava X3: ధర, స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.