భారత్ లో లాంచైన చవకైన స్మార్ట్ ఫోన్ Lava X3: ధర, స్పెసిఫికేషన్స్

హైలైట్స్

  • శాంసంగ్, ఒప్పో, రియల్మీ, వివో, షావోమి ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోన్న Lava కంపెనీ
  • లో-బడ్జెట్ సెగ్మెంట్ లో తాజాగా భారత్ లో Lava X3 ని లాంచ్ చేసిన లావా కంపెనీ
  • మీడియాటెక్ హీలియో ఏ22 చిప్, ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ తో లాంచైన Lava X3 స్మార్ట్ ఫోన్

భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా తన మార్కెట్ వాటాను మళ్ళీ సుస్థిరం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరుసగా ఫోన్లను లాంచ్ చేస్తూ బడ్జెట్ శ్రేణిలో షావోమి, రియల్మీ, శాంసంగ్, వివో మరియు ఒప్పో ఫోన్లకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. లావా సంస్థ బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో యాక్టివ్ గా ఉంది. ఇటీవలె ఈ సంస్థ Lava Agni 5G, Lava Blaze 5G ఫోన్లను లాంచ్ చేసి జోరు మీద ఉంది.

తాజాగా లావా సంస్థ ఎంట్రీ లెవెల్ ఫోన్ Lava X3 ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెడ్మీ ఏ1+ మరియు రియల్మీ సీ-సిరీస్ ఫోన్లతో పోటీ పడనుంది. Lava X3 మీడియాటెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఓఎస్ తో లాంచైంది. ఓసారి భారత్ లో Lava X3 యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Lava X3 ధర, స్పెసిఫికేషన్స్

Lava X3 ఒక బడ్జెట్ సెగ్మెంట్ 4జీ స్మార్ట్ ఫోన్. భారత్ లో ఈ ఫోన్ ధరను రూ.6,999. మూడు కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. అవి: చార్కోల్ బ్లాక్, ఆర్కిటిక్ బ్లూ, లస్టర్ బ్లూ. 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీతో ఈ ఫోన్ లాంచైంది. డిసెంబర్ 20 నుంచి ఈ ఫోన్ సేల్ కి వస్తోంది. ప్రీ-ఆర్డర్ చేసే కస్టమర్లకు రూ.2,999 విలువజేసే Lava ProBuds N11 నెక్ బ్యాండ్ ని గెలుచుకునే అవకాశం ఉంది.

Lava X3 స్మార్ట్ ఫోన్ పాలికార్బొనేట్ బాడీతో తయారైంది. ఈ ఫోన్ 6.53-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్ కలిగి ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బెజెల్స్ సన్నగా, చిన్ మందంగా ఉంటుంది. ఎంట్రీ లెవెల్ ఫోన్ గనుక ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు.

Lava X3 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8 ఎంపి ప్రైమరీ కెమెరా, మరొక వీజీఏ సెన్సర్ ఉంటాయి. ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Lava X3 స్మార్ట్ ఫోన్ లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉంటాయి. మెమొరీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 512జిబి వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పై ఫోన్ పని చేస్తుంది. భద్రత కోసం రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 3.5ఎంఎం జాక్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.