
Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ అఫీషియల్ గా చైనా మరియు గ్లోబల్ గా లాంచైంది. ఈ డివైజ్ షావోమి 11 అల్ట్రా కి సక్సెసర్ గా వచ్చింది. Xiaomi 13 Ultra డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 1-ఇంచ్ సోని ఐఎంఎక్స్989 సెన్సర్, వీసీ లిక్విడ్ కూలింగ్ ఏరియా, డాల్బి విజన్ సపోర్ట్, ఐపీ68 రేటింగ్, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, లెదర్ బ్యాక్ ఫినిషింగ్ తో వచ్చింది. సరే, ఓసారి Xiaomi 13 Ultra ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Xiaomi 13 Ultra ధర, కలర్ ఆప్షన్స్
- Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ 12జిబి + 256జిబి మోడల్ ధర RMB 5999 (సుమారు రూ.71,600) గా ఉంది.
- 16జిబి + 512జిబి మోడల్ ధర RMB 6499 (సుమారు రూ.77,600) గా ఉంది.
- 16జిబి + 1టిబి వేరియంట్ ధర RMB 7299 (సుమారు రూ.87,200) గా ఉంది.
- ఈ ఫోన్ ఆలివ్ గ్రీన్, బ్లాక్ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
Xiaomi 13 Ultra స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Xiaomi 13 Ultra లో 6.73-ఇంచ్ 2కే అమలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, 3200 * 1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, డాల్బి విజన్, పీ3 కలర్ గేముత్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కర్వ్డ్ ఎడ్జెస్ ఉన్నాయి.
బ్యాటరీ: ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ మరియు 50 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
కనెక్టివిటీ: Xiaomi 13 Ultra లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
చిప్సెట్: ఈ షావోమి ఫ్లాగ్షిప్ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ ీ చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.
ర్యామ్ మరియు స్టోరేజీ: ఈ ఫోన్ లో 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ మరియు 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.
రియర్ కెమెరా: Xiaomi 13 Ultra లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 ప్రైమరీ కెమెరా, హైపర్-ఓఐఎస్, 8పి లెన్స్, ఈఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. దీనికి తోడు 50ఎంపి సోని ఐఎంఎక్స్858 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపి సూపర్ టెలీఫోటో ఓఐఎస్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో 3ఎక్స్ లెన్స్ ఉన్నాయి.
ఫ్రంట్ కెమెరా: సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
కనెక్టివిటీ: Xiaomi 13 Ultra లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, హై-రెజ్ ఆడియో, డాల్బి అట్మాస్, ఐఆర్ బ్లాస్టర్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.
ఐపీ రేటింగ్: Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ లో ఐపీ68 వాటర్ మరియు డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది.
ఓఎస్: Xiaomi 13 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











