
Vivo సబ్-బ్రాండ్ iQOO నేడు తన సొంత మార్కెట్ చైనాలో iQOO Neo 9 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. రెండు ఫోన్లు కూడా 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా, 5160ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78-ఇంచ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చాయి. సరే, ఓసారి iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
iQOO Neo 9, iQOO Neo 9 Pro ధరలు
- iQOO Neo 9 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2,299 యువాన్లు (సుమారు రూ.27,675)
- iQOO Neo 9 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 2,499 యువాన్లు (సుమారు రూ.29,127)
- iQOO Neo 9 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2,799 యువాన్లు (సుమారు రూ.32,623)
- iQOO Neo 9 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 3,199 యువాన్లు (సుమారు రూ.37,285)
- iQOO Neo 9 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2,999 యువాన్లు (సుమారు రూ.34,954)
- iQOO Neo 9 Pro 12జిబి+512జిబి మోడల్ ధర 3,299 యువాన్లు (సుమారు రూ.38,452)
- iQOO Neo 9 Pro 16జిబి+512జిబి వేరియంట్ ధర 3,599 యువాన్లు (సుమారు రూ.41,948)
- iQOO Neo 9 Pro 16జిబి+1టిబి వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.46,611)
iQOO Neo 9, iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 93.43 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ 10, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: iQOO Neo 9 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉన్నాయి. iQOO Neo 9 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: రెండు ఫోన్లు కూడా 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తాయి.
- iQOO Neo 9 కెమెరా: iQOO Neo 9 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- iQOO Neo 9 Pro కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: రెండు ఫోన్లలో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
- ఓఎస్: iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
- కనెక్టివిటీ: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, 4జీ వొల్టీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఓటీజీ సపోర్ట్, జీపీఎస్/బైడూ/గెలీలియో/క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: iQOO Neo 9 సిరీస్ ఫోన్లలో క్యూ1 డెడికేటెడ్ చిప్, 6కే కెనోపి వీసీ కూలింగ్ సిస్టమ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉన్నాయి.











