Vivo సబ్-బ్రాండ్ iQOO ఫిబ్రవరి నెలలో iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఐకూ సంస్థ తన X ఖాతా ద్వారా ఈ డివైజ్ కి సంబంధించిన టీజర్స్ షేర్ చేస్తూ వస్తోంది. టీజర్స్ ద్వారా iQOO Neo 9 Pro డివైజ్ డ్యూయల్-టోన్ వేరియంట్ లో వస్తుందని తెలిసింది. మరోవైపు Amazon మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్ యొక్క డిజైన్ ఎలిమెంట్స్ రివీల్ అయ్యాయి. తాజాగా iQOO Neo 9 Pro చిప్సెట్ వివరాలు ఖరారు అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
iQOO Neo 9 Pro చిప్సెట్ వివరాలు (ఇండియా)
- iQOO Neo 9 Pro డివైజ్ భారతీయ మార్కెట్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తుందని సమాచారం.
- ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ద్వారా iQOO Neo 9 Pro సేల్ కి రానుంది. ప్రస్తుతం ఈ సైట్ లో మైక్రోసైట్ దర్శనమిస్తోంది.
- iQOO Neo 9 సిరీస్ లో iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి.
- ఇప్పటికే ఈ రెండు ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. ఓసారి ఈ డివైజెస్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
iQOO Neo 9, iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ (చైనా వేరియంట్స్)
- డిస్ప్లే: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 93.43 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ 10, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: iQOO Neo 9 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉన్నాయి. iQOO Neo 9 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: రెండు ఫోన్లు కూడా 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తాయి.
- iQOO Neo 9 కెమెరా: iQOO Neo 9 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- iQOO Neo 9 Pro కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: రెండు ఫోన్లలో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
- ఓఎస్: iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
- కనెక్టివిటీ: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, 4జీ వొల్టీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఓటీజీ సపోర్ట్, జీపీఎస్/బైడూ/గెలీలియో/క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్సీ, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: iQOO Neo 9 సిరీస్ ఫోన్లలో క్యూ1 డెడికేటెడ్ చిప్, 6కే కెనోపి వీసీ కూలింగ్ సిస్టమ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉన్నాయి.
