Vivo సబ్-బ్రాండ్ iQOO త్వరలో Neo 9 సిరీస్ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ రానున్నాయి. ఇప్పటికే iQOO Neo 9 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ప్రో మోడల్ iQOO Neo 9 Pro ని భారత్ లో లాంచ్ చేసేందుకు ఐకూ సిద్ధమవుతోంది. తాజాగా ఐకూ లాంచ్ ప్రకటన చేసింది. భారత్ లో iQOO Neo 9 Pro డివైజ్ ఫిబ్రవరి 22న లాంచ్ అవ్వబోతున్నట్లు అధికారికంగా ఐకూ వెల్లడించింది. సరే, ఓసారి iQOO Neo 9 Pro లాంచ్ వివరాలు, అంచనా ధర, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.
iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ తేదీ
- iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ తేదీని ఐకూ తన X ఖాతా ద్వారా షేర్ చేసింది.
- iQOO Neo 9 Pro డివైజ్ భారత్ లో 2024 ఫిబ్రవరి 22 న లాంచ్ కానుందని తన పోస్ట్ ద్వారా ఐకూ తెలిపింది.
- అలాగే, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ లో iQOO Neo 9 Pro యొక్క మైక్రోసైట్ ఇప్పటికే దర్శనమిస్తోంది. ఈ లిస్టింగ్ లో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వివరాలు ఉన్నాయి.
Mark your calendars! ? #iQOONeo9Pro, featuring an elegant dual-tone leather design, is arriving in style on 22nd Feb 2024. Brace yourself for the thrilling release @amazonIN & https://t.co/7tsZtgDjuv
Notify Now – https://t.co/5uyur6lqdp
#iQOO #PowerToWin #iQOONeo9Pro pic.twitter.com/rkqQP51bov— iQOO India (@IqooInd) January 16, 2024
iQOO Neo 9 Pro ధర (అంచనా)
- iQOO Neo 9 Pro స్మార్ట్ఫోన్ చైనాలో 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
- iQOO Neo 9 Pro ధర భారత్ లో రూ.40,000 కంటే తక్కువగా ఉంటుందని సమాచారం.
iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: iQOO Neo 9 Pro లో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్10, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: iQOO Neo 9 Pro లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉంటాయి.
- మెమొరీ: iQOO Neo 9 Pro 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: iQOO Neo 9 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ మెయిన్ సెన్సర్, 50ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: iQOO Neo 9 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: iQOO Neo 9 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: iQOO Neo 9 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, వై-ఫై 7, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.
