Vivo సబ్-బ్రాండ్ iQOO త్వరలో Neo 9 Pro అనే స్మార్ట్ఫోన్ ని లాంచ్ చేయనుంది. భారతీయ మార్కెట్ లో ఫిబ్రవరి 22న iQOO Neo 9 Pro లాంచ్ అవుతోంది. ఐకూ ఫ్యాన్స్ ఈ ఫోన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈలోపు iQOO Neo 9 Pro డివైజ్ అమెజాన్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
iQOO Neo 9 Pro ఇండియా స్పెసిఫికేషన్స్ ఖరారు
- iQOO Neo 9 Pro డివైజ్ అమెజాన్ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది.
- iQOO Neo 9 Pro డివైజ్ 5,160 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది.
- iQOO Neo 9 Pro స్మార్ట్ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
- iQOO Neo 9 Pro డివైజ్ 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయని తెలుస్తోంది.
- iQOO Neo 9 Pro డివైజ్ ఫైరీ రెడ్, కాంక్వెరర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- iQOO Neo 9 Pro ఫోన్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఖరారైంది.
- iQOO Neo 9 Pro డివైజ్ 256జిబి వరకు స్టోరేజీ, 8జిబి/12జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.
- iQOO Neo 9 Pro ఫోన్ క్యూ1 గేమింగ్ చిప్ తో వస్తోంది. ఈ ఫోన్ గేమర్స్ ని ఉద్దేశించి తీసుకొస్తున్నారు.
iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: iQOO Neo 9 Pro లో 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉంటాయి.
- చిప్సెట్: iQOO Neo 9 Pro లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, అడ్రెనో జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9 Pro డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
- కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: iQOO Neo 9 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: iQOO Neo 9 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
