
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో నియో సిరీస్ లో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. iQOO Neo 9S Pro+ పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. అయితే ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈలోపు సర్టిఫికేషన్ వెబ్‌సైట్ MIIT పై iQOO Neo 9S Pro+ లిస్ట్ అయ్యింది. ఓసారి లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
iQOO Neo 9S Pro+ ఎంఐఐటీ లిస్టింగ్
iQOO Neo 9S Pro+ స్మార్ట్‌ఫోన్ ఎంఐఐటీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2403A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
మోడల్ నంబర్ కాకుండా, ఎంఐఐటీ లిస్టింగ్ ద్వారా 5జీ కనెక్టివిటీ రివీల్ అయ్యింది. ఇంకా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో iQOO Neo 9S Pro+ లాంచ్ అవుతోందని లిస్టింగ్ పై ఉంది.
ఎంఐఐటీ ప్లాట్ఫామ్ పై iQOO Neo 9S Pro+ లిస్ట్ అవ్వడంతో, త్వరలోనే చైనాలో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని స్పష్టమవుతోంది. తర్వాత భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ విడుదలవ్వనుంది.

iQOO Neo 9S Pro+ స్పెసిఫికేషన్స్ (లీక్)
డిస్ప్లే: iQOO Neo 9S Pro+ లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
ప్రాసెసర్: iQOO Neo 9S Pro+ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9S Pro+ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.
కెమెరా: iQOO Neo 9S Pro+ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ఓఎస్: iQOO Neo 9S Pro+ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.
బ్యాటరీ: iQOO Neo 9S Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: iQOO Neo 9S Pro+ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.











