
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నేడు భారతీయ మార్కెట్ లో Xiaomi 14 Civi డివైజ్ ను లాంచ్ చేసింది. మిడ్-బడ్జెట్ లో ఉత్తమమైన ఫీచర్లతో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి + 32ఎంపి డ్యూయల్ ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Xiaomi 14 Civi ధర, లభ్యత
Xiaomi 14 Civi స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Xiaomi 14 Civi యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.42,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.47,999 గా పెట్టారు.
లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ కొనే వారికి ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ పై రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, రూ.3,000 ఎక్స్‌చేంజ్ బోనస్ సౌకర్యం కూడా ఉంది.
Xiaomi 14 Civi స్మార్ట్‌ఫోన్ జూన్ 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్స్ మరియు కంపెనీ అధికార వెబ్‌సైట్ ద్వారా డివైజ్ ను కొనుగోలు చేయవచ్చు.
జూన్ 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి Xiaomi 14 Civi యొక్క ప్రీ-బుకింగ్స్ మొదలవుతాయి. మొదటగా బుక్ చేసుకునే వారికి Redmi Watch 3 Active ఉచితంగా లభిస్తుంది.
Xiaomi 14 Civi స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Xiaomi 14 Civi లో 6.55-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫ్లోటింగ్ క్వాడ్-కర్వ్ ప్యానెల్, 1236*2750 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, 3000 నిట్స్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Xiaomi 14 Civi లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. టీ1 సిగ్నల్ ఎన్హాన్స్‌మెంట్ చిప్ ను ఈ ఫోన్ లో అమర్చారు.
ర్యామ్, స్టోరేజీ: Xiaomi 14 Civi 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి స్టోరేజీతో వచ్చింది.
ఫ్రంట్ కెమెరా: Xiaomi 14 Civi లో 32ఎంపి + 32ఎంపి డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంది. ఇది ఏఐ ఫీచర్ ను కలిగి ఉంది.
రియర్ కెమెరా: Xiaomi 14 Civi లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి 50ఎంఎం లైకా ప్రొఫెషనల్ పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.
ఓఎస్: Xiaomi 14 Civi డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
బ్యాటరీ: Xiaomi 14 Civi లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Xiaomi 14 Civi లో డ్యూయల్ సిమ్, 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ, డాల్బీ అట్మాస్, హై-రెజ్ ఆడియో, స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ ఉన్నాయి.











