
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో ఒక కొత్త నియో సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. iQOO Neo 9s Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఏడాది ఆరంభంలో లాంచైన iQOO Neo 9 Pro కి సబ్-వేరియంట్ గా iQOO Neo 9s Pro లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ మరియు గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.
iQOO Neo 9s Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
iQOO Neo 9s Pro యొక్క డిస్ప్లే, చిప్సెట్ వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Weibo పై షేర్ చేశారు.
లీక్ ప్రకారం, iQOO Neo 9s Pro డివైజ్ 1.5కే గేమింగ్ స్క్రీన్, హై రిఫ్రెష్ రేట్, డెడికేటెడ్ గేమింగ్ చిప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
iQOO Neo 9s Pro క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా రివీల్ అయ్యింది.
మే డే హాలిడే సీజన్ తర్వాత iQOO Neo 9s Pro చైనాలో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ పై V2339FA అనే మోడల్ నంబర్ తో iQOO Neo 9s Pro లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కన్ఫర్మ్ అయ్యింది.
iQOO Neo 9s Pro స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఫుల్ హెచ్డీ+ స్క్రీన్ వంటి ఫీచర్స్ రివీల్ అయ్యాయి. ఆసక్తికరమైన విషయమేంటంటే, గూగుల్ ప్లే కన్సోల్ లిస్ట్ పై iQOO Neo 9s Pro మీడియాటెక్ డైమెన్సిటీ 8300 చిప్సెట్ తో కనిపించింది.
iQOO Neo 9s Pro డివైజ్ 6.78-ఇంచ్ ఫ్లాట్ 8టీ ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో రానుంది.












