
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung భారతీయ మార్కెట్ లో Galaxy S24 5G 128జిబి స్టోరేజీ వేరియంట్‌ని లాంచ్ చేసింది. ఈ ఏడాది ఆరంభంలో లాంచైన గెలాక్సీ ఎస్24 256జిబి స్టోరేజీ మరియు 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు 128జిబి స్టోరేజీ మోడల్ కూడా వీటితో చేరింది. ఎస్24 ఫోన్ కొనాలని భావించే వారు మిగతా వేరియంట్స్ కంటే కాస్త తక్కువ ధరలో 128జిబి మోడల్ ని కొనుగోలు చేయవచ్చు. ఓసారి ఈ కొత్త వేరియంట్ ధర మరియు లభ్యత వివరాలను తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy S24 5G ధర, లభ్యత
Samsung Galaxy S24 5G 128జిబి మోడల్ ధరను భారత్ లో రూ.74,999 గా నిర్ణయించారు. శాంసంగ్ ఈస్టోర్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై శాంసంగ్ రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (ఈఎంఐ, నాన్-ఈఎంఐ) మరియు డెబిట్ (ఈఎంఐ) కార్డ్ లావాదేవీలపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. అంతేకాదు, రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. కానీ, ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు బ్యాంక్ ఆఫర్‌ని కలిపి వాడలేరు.
Samsung Galaxy S24 5G 128జిబి కలర్ ఆప్షన్స్
Samsung Galaxy S24 5G 128GB స్టోరేజీ మోడల్ అంబర్ యెల్లీ, కొబాల్ట్ వయొలెట్, ఆనిక్స్ బ్లాక్ మరియు మార్బుల్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Samsung Galaxy S24 5G స్పెసిఫికేషన్స్
స్క్రీన్: Samsung Galaxy S24 5G లో 6.2-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, 1-120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ (2340*1080 పిక్సెల్) రెజుల్యూషన్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
ప్రాసెసర్: Samsung Galaxy S24 5G లో శాంసంగ్ ఎగ్జినోస్ 2400 చిప్సెట్ ని వాడారు. గ్రాఫిక్స్ కోసం Xclipse 940 జీపీయూని వినియోగించారు.
మెమొరీ: Samsung Galaxy S24 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి / 256జిబి / 512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
బ్యాటరీ: Samsung Galaxy S24 5G లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కెమెరా: Samsung Galaxy S24 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 10ఎంపి ఓఐఎస్ 3ఎక్స్ టెలీఫోటో లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
కనెక్టివిటీ: Samsung Galaxy S24 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూడబ్ల్యూబి, యూఎస్బీ 3.2 జెన్ 1 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











