
ఐకూ సంస్థ మెల్లగా జెడ్7 సిరీస్ లో తన రెండో ఫోన్ iQOO Z7s 5G ని గత వారం అమెజాన్ లో లిస్ట్ చేసింది. అంతకు ముందు ఈ సంస్థ, iQOO Z7 ని మార్చిలో లాంచ్ చేసింది. తాజాగా iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ వెబ్ సైట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉందని ఐకూ కంపెనీ అధికారికంగా తెలిపింది.
iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్, 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.20,000 లోపే ఉంది. సరే, ఓసారి iQOO Z7s 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్లో iQOO Z7s 5G ధర, సేల్ వివరాలు
iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ 6జిబి+128జిబి మోడల్ ధర రూ.18,999 గా ఉంది. 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. ఈ డివైజ్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనుందని అఫీషియల్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. పసిఫిక్ నైట్, నార్వే బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.
అయితే ఐకూ సంస్థ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ మరియు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ యూజర్లు అదనంగా రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో iQOO Z7s 5G ధర రూ.17,499 కి తగ్గనుంది. అయితే, ఐకూ సంస్థ ఈ ఆఫర్ యూజర్లకు ఎప్పటి నుంచి అందుబాటులో ఉండనుందో తెలపలేదు.
ప్రస్తుతం iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఇండియా మరియు ఐకూ వెబ్ సైట్ పై కొనుగోలుకి అందుబాటులో ఉంది.
iQOO Z7s 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
- 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇంకా 1200 హెర్ట్జ్ ఇన్స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 10x టచ్ కంట్రోల్ రెజుల్యూషన్, మోషన్ కంట్రోల్ ఉన్నాయి.
కెమెరా విభాగం
- 64ఎంపి రియర్ కెమెరా
- 16ఎంపి ఫ్రంట్ కెమెరా
iQOO Z7s 5G స్మార్ట్ఫోన్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది. నైట్ సీన్, పొట్రెయిట్ మోడ్, మైక్రో మూవీ, పనోరమ, డైనమిక్ ఫోటో, స్లో మోషన్, టైమ్-ల్యాప్స్ ఫొటోగ్రఫీ, ప్రో మోడ్, ఏఆర్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
చిప్సెట్, స్టోరేజీ
- స్నాప్ డ్రాగన్ 695
- 6జిబి/8జిబి ర్యామ్
- 128జిబి స్టోరేజీ
iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఇంకా 8జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్ 3.0, అడ్రెనో 619 జీపీయూ, అల్ట్రా గేమ్ మోడ్ ఉన్నాయి.
బ్యాటరీ, చార్జింగ్
- 4500 ఎంఏహెచ్
- 44 వాట్ చార్జింగ్
iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. 44 వాట్ చార్జింగ్ సపోర్ట్ ని ఈ ఫోన్ లో అందించారు.
ఓఎస్, డైమెన్షన్స్, వెయిట్
- ఆండ్రాయిడ్ 13 ఓఎస్
- 172 గ్రాములు
iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ 158.91 మిల్లీ మీటర్ల పొడవు, 73.53 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.80 మిల్లీ మీటర్ల మందం, 172 గ్రాముల బరువు ఉంటుంది.
కనెక్టివిటీ
- 5జీ
- బ్లూటూత్ 5.1
iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో వై-ఫై, 5జీ, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, జీఎన్ఎస్ఎస్, క్యూజెడ్ఎస్ఎస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్లాక్ ఉన్నాయి.











