
స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా సంస్థ భారత్ లో తాజాగా అగ్ని స్మార్ట్ ఫోన్ సక్సెసర్, కొత్త Lava Agni 2 5G డివైజ్ ని లాంచ్ చేసింది. Lava Agni 2 5G డివైజ్ గ్రీన్-కలర్ తో ఉన్న కర్వ్డ్ రియర్ ప్యానెల్, భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ని కలిగి ఉంది. 3డీ డ్యూయల్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ తో వచ్చిన చవకైన స్మార్ట్ ఫోన్ గా Lava Agni 2 5G నిలవనుంది. Lava Agni 2 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వచ్చింది.
Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ లో 4700 బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో, 2ఎంపి డెప్త్ కెమెరాలు ఉన్నాయి. 5జీ, 4జీ ఇతర అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి.
Lava Agni 2 5G కి ప్రత్యామ్నాయ ఆప్షన్స్
1. OnePlus Nord CE 3 Lite
2. OPPO A78 5G
3. Samsung Galaxy A23
4. Redmi K50i 5G
5. Motorola Edge 30
OnePlus Nord CE 3 Lite

- 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే
- స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
- 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ
- 8జిబి వర్చువల్ ర్యామ్
- 108ఎంపి ఈఐఎస్ కెమెరా
- 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలు
OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ డివైజ్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు.
OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 91.4 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగిన డిస్ప్లే, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ తో వచ్చింది. ఇది బ్యాటరీ లైఫ్ ని పెంచడమే గాక, యాప్స్ మధ్య మారడాన్ని తేలిక చేస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ లో ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు 200 పర్సెంట్ అల్ట్రా వాల్యూమ్ మోడ్ తో వచ్చాయి. ఈ డివైజ్ లో 3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్ ఉండటం విశేషం.
OnePlus Nord CE 3 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఈఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
OPPO A78 5G స్పెసిఫికేషన్స్
- 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
- మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్
- 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
- ఆండ్రాయిడ్ 13 ఓఎస్
- 50ఎంపి + 2ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
- 8ఎంపి సెల్ఫీ కెమెరా
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 89.8 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 600 నిట్స్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.
OPPO A78 5G ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉన్నాయి. OPPO A78 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. OPPO A78 5G ఫోన్ 7.9 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.
OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
Samsung Galaxy A23 స్పెసిఫికేషన్స్
- 6.6-inch FHD+ IPS LCD డిస్ప్లే
- Qualcomm Snapdragon 695 చిప్
- 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్
- 50ఎంపి క్వాడ్ కెమెరా సెటప్
- 13ఎంపి సెల్ఫీ కెమెరా
Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ అందించారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి.
Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ పై 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.
Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
Redmi K50i స్పెసిఫికేషన్స్
- డైమెన్సిటీ 8100 చిప్సెట్
- 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్
- 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ
- 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
- 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
రెడ్ మీ కే50ఐ 5జీ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, రెడ్ మీ నోట్ 11 ప్రో స్పెసిఫికేషన్స్ ని పోలి ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 8జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్లో ఉన్నాయి. అయితే మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం లేదు.
6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 270 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్, 650 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. బలమైన మన్నిక కొరకు, రెడ్ మీ కే50ఐ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో డిస్ప్లే కు భద్రత కల్పించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ఇక ఫోటొగ్రఫీ కోసం రెడ్ మీ కే50ఐ 5జీ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64ఎంపి శాంసంగ్ జీడబ్ల్యూ1 సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 2ఎంపి మాక్రో సెన్సర్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 8ఎంపి కెమెరా ఉంది.
3.5ఎంఎం హెడ్ ఫోన్ జ్యాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, డాల్బీ అట్మాస్, లిక్విడ్ కూలింగ్ 2.0 టెక్నాలజీ వంటి కనెక్టింగ్ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ లో 5080ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
Motorola Edge 30 స్పెసిఫికేషన్స్
- స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్
- 6.5-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే
- 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్
- 4020 ఎంఏహెచ్ బ్యాటరీ
- 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ
మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 4020 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్సీ, 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12, మైయూఎక్స్ కస్టమ్ స్కిన్, డాల్బి అట్మాస్ సపోర్ట్ ఉన్నాయి.
Motorola Edge 30 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా (మ్యాక్రో ఆప్షన్), 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.













