
iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ ధర, డిజైన్ రెండర్స్ రీసెంట్ గా లీక్ అయ్యాయి. ఈలోపు భారత్ లో ఈ ఫోన్ అధికారికంగా వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో జెడ్7 సిరీస్ లో జెడ్7 5జీ తర్వాత వస్తోన్న రెండో డివైజ్ ఇది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ తో జెడ్7 5జీ డివైజ్ లాంచ్ కాగా, iQOO Z7s 5G ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఉన్నాయి.
భారత్ లో iQOO Z7s 5G ధర, లభ్యత
- 6జిబి+128జిబి= రూ.18,999
- 8జిబి+128జిబి= రూ.19.999
iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ ఫసిపిక్ నైట్ మరియు నార్వే బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ కలర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. 6జిబి+128జిబి వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. 8జిబి+128జిబి మోడల్ ధర రూ.19,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ ని ఐకూ మరియు అమెజాన్ ఇండియా వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
iQOO Z7s 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
డిస్ప్లే
- 6.38-ఇంచ్ స్క్రీన్
- 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 10x టచ్ కంట్రోల్ రెజుల్యూషన్, మోషన్ కంట్రోల్ ఉన్నాయి. ఈ హ్యాండ్సెట్ లో అల్ట్రా గేమ్ మోడ్ ఉంది.
చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ
- స్నాప్ డ్రాగన్ 695 చిప్
- 6జిబి/8జిబి ర్యామ్
iQOO Z7s 5G లో స్నాప్ డ్రాగన్ 695 చిప్ ఉంటుంది. ఇందులో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వాడారు. ఈ ఫోన్ 6జిబి లేదా 8జిబి ర్యామ్ వేరియంట్ లో లభ్యం కానుంది. 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 3.0 ఫీచర్ ద్వారా 6జిబి/8జిబి వర్చువల్ ర్యామ్ లభిస్తుంది. మెమొరీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు.
ఓఎస్, బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 13
- 4500 ఎంఏహెచ్
- 44 వాట్ చార్జింగ్
iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
కెమెరా విభాగం
- 64ఎంపి రియర్ కెమెరా
- 16ఎంపి సెల్ఫీ కెమెరా
iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంది. దీంతో పాటు ఒక 2ఎంపి బొకే లెన్స్ ఉంది. ఇంకా నైట్ సీన్, పొట్రెయిట్ మోడ్, మైక్రో మూవీ, 64ఎంపి పనోరమ, డైనమిక్ ఫోటో, స్లో మోషన్, టైమ్-ల్యాప్స్ ఫోటోగ్రఫీ, ప్రో మోడ్, ఏఆర్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
కనెక్టివిటీ
- 5జీ
- 4జీ
iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్ లో 4జీ, 5జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, జీఎన్ఎస్ఎస్ మరియు క్యూజెడ్ఎస్ఎస్ వంటివి ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.











