
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo Y200e 5G అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 22న లాంచ్ అవ్వనుందని కొన్ని రోజుల క్రితం ఓ వార్త బయటకు వచ్చింది. తాజాగా Vivo Y200e 5G యొక్క ధరకి సంబంధించి 91మొబైల్స్ కి ఎక్స్క్లూజివ్ సమాచారం అందింది. దాని ప్రకారం, Vivo Y200e 5G ధర భారతీయ మార్కెట్ లో రూ.19,999 ఉంటుందని తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo Y200e 5G ధర వివరాలు
- Vivo Y200e 5G స్మార్ట్ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంటుందని తెలుస్తోంది.
- Vivo Y200e 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.20,999 గా ఉండవచ్చు.
Vivo Y200e 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Vivo Y200e 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo Y200e 5G లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
- రియర్ కెమెరా: Vivo Y200e 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి.
- ఫ్రంట్ కెమెరా: సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Vivo Y200e 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కలర్ ఆప్షన్స్: Vivo Y200e 5G డివైజ్ శాఫ్రన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- బరువు, మందం: Vivo Y200e 5G డివైజ్ బ్లాక్ కలర్ వేరియంట్ 7.79 మి.మీ మందం, 185.5 గ్రాముల బరువు ఉంటుంది. శాఫ్రన్ కలర్ ఫోన్ 7.99 మి.మీ మందం, 191 గ్రాముల బరువు ఉంటుంది.












