Home News iQOO Z9 5G లో ఉన్న టాప్-5 ఫీచర్స్

iQOO Z9 5G లో ఉన్న టాప్-5 ఫీచర్స్

Vivo సబ్-బ్రాండ్ iQOO నేడు భారతీయ మార్కెట్ లో Z9 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్ పవర్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 256జిబి స్టోరేజీ, 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి చక్కటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి iQOO Z9 5G లో ఉన్న టాప్-5 ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం పదండి.

iQOO Z9 5G టాప్-5 ఫీచర్లు

iQOO Z9 5G లో ఇంకా ఐపీ54 రేటింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, వై-ఫై 6, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

iQOO Z9 5G ధర, కలర్ ఆప్షన్స్

iQOO Z9 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

ఐసీఐసీఐ మరియు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. 3 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

మార్చి 14 నుంచి అధికార వెబ్‌సైట్ మరియు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా iQOO Z9 5G సేల్ కి అందుబాటులో ఉంటుంది.

iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ బ్రష్డ్ గ్రీన్ మరియు గ్రాఫీన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

iQOO Z9 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Z9 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Z9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి 610 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. యూజర్ కి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ద్వారా గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.

కెమెరా: iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: iQOO Z9 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: iQOO Z9 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

కనెక్టివిటీ: iQOO Z9 5G లో డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ, బ్లూటూత్, వై-ఫై 6 ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: iQOO Z9 5G లో ఐపీ54 రేటింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.