
భారతీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ LAVA నేడు భారతీయ మార్కెట్ లో LAVA Yuva 3 డివైజ్ ని లాంచ్ చేసింది. ఇటీవలె LAVA Yuva 3 ఫోన్ లాంచ్ గురించి లావా సంస్థ టీజ్ చేసింది. షాపింగ్ సైట్ అమెజాన్ ఇండియా లో ఈ ఫోన్ నిన్ననే లిస్ట్ అయ్యింది. నేడు అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. సరే, LAVA Yuva 3 స్మార్ట్ఫోన్ ఆఫర్ చేసే స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.
LAVA Yuva 3 ధర
- LAVA Yuva 3 స్మార్ట్ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- LAVA Yuva 3 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ,6,799 గా ఉంది.
- LAVA Yuva 3 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,299 గా ఉంది.
- LAVA Yuva 3 సేల్ ఫిబ్రవరి 7 నుంచి అమెజాన్ ద్వారా మొదలవుతుంది.
- LAVA Yuva 3 స్మార్ట్ఫోన్ ఎక్లిప్స్ బ్లాక్, కాస్మిక్ లావెండర్ మరియు గెలాక్సీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
LAVA Yuva 3 డిజైన్
- LAVA Yuva 3 స్మార్ట్ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
- కెమెరా సెటప్ ని రూపొందించిన విధానం iPhone 15 Pro Max ని గుర్తు చేస్తుంది.
- రియర్ ప్యానెల్ పూర్తిగా ఫ్లాట్ గా ఉంది. బాటమ్ లో లావా బ్రాండింగ్ ఉంది.
- LAVA Yuva 3 లో కుడివైపు ఫ్రేమ్ పై వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎంబెడ్ చేయబడి ఉంది.
- LAVA Yuva 3 బాటమ్ ఫ్రేమ్ పై యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ ఉన్నాయి.
LAVA Yuva 3 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: LAVA Yuva 3 లో 6.5-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: LAVA Yuva 3 డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ని కలిగి ఉంది.
- ప్రాసెసర్: LAVA Yuva 3 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు.
- ఓఎస్: LAVA Yuva 3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ పాటు ఓఎస్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి.
- బ్యాటరీ: LAVA Yuva 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: LAVA Yuva 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, రెండు ఇతర సెన్సర్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- ఇతర ఫీచర్లు: LAVA Yuva 3 లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.











