
Vivo సబ్-బ్రాండ్ iQOO 2023 ఆగస్టులో iQOO Z8 సిరీస్ ని చైనాలో లాంచ్ చేసింది. iQOO Z8 సిరీస్ లో iQOO Z8, iQOO Z8x ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడు ఐకూ సంస్థ మరొక జెడ్-సిరీస్.. iQOO Z9 పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా iQOO Z9 సిరీస్ యొక్క స్మార్ట్‌ఫోన్ల రెండర్స్ చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో పై ప్రత్యక్షమైంది. ఫిక్స్‌డ్ ఫోకస్ డిజిటల్ అనే యూజర్ వీటిని షేర్ చేశారు. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
iQOO Z9 సిరీస్ రెండర్స్
iQOO Z9 renders.
Via: 定焦数码 (Weibo) pic.twitter.com/BPnh90dYEA
— Abhishek Yadav (@yabhishekhd) January 8, 2024
- iQOO Z9 సిరీస్ రెండర్స్ ని గమనిస్తే, డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరాల పక్కన ఓఐఎస్ ఆస్పెరికల్ అని టెక్స్ట్ రాసి ఉంది.
- iQOO Z9 సిరీస్ కి సంబంధించి లీకైన రెండర్స్ లో రెండు ఫోన్లు ఉన్నాయి. వీటిలో ఒక దానిలో రెండు సర్క్యులర్ కెమెరా మాడ్యూల్స్ ఉండగా, మరొక దానిలో స్క్వైరికల్ కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి.
- iQOO Z9 సిరీస్ హ్యాండ్సెట్స్ గ్రేడియంట్ ఫినిష్ డిజైన్ తో వస్తున్నట్లు లీకైన రెండర్స్ ని చూస్తే తెలుస్తోంది.
- రియర్ ప్యానెల్ పై నిలువుగా ఉన్న స్ట్రిప్ డిజైన్ కనిపిస్తోంది. ఈ వివరాలు కాకుండా మరే ఇతర విషయాలు తెలియలేదు.
iQOO Z8 స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: iQOO Z8 లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2388*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 19.9:9 యాస్పెక్ట్ రేషియో, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
- చిప్సెట్: iQOO Z8 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఒడిన్ ఎంసీ6 జీపీయూ వినియోగించారు.
- ఓఎస్: iQOO Z8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: iQOO Z8 లో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. 16ఎంపి ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు.
- బ్యాటరీ: iQOO Z8 లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
- కనెక్టివిటీ: iQOO Z8 లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: iQOO Z8 లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ అందించారు.
iQOO Z8x స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: iQOO Z8x 5G లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2388 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 19.9:9 యాస్పెక్ట్ రేషియో, పంచ్-హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: iQOO Z8x 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వినియోగించారు.
- ర్యామ్, స్టోరేజీ: iQOO Z8x 5G డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
- ఓఎస్: iQOO Z8x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: iQOO Z8x 5G డివైజ్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: iQOO Z8x 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: iQOO Z8x 5G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
- కనెక్టివిటీ: iQOO Z8x 5G లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
- డైమెన్షన్స్: iQOO Z8x 5G డివైజ్ 164.63 మి.మీ పొడవు, 75.80 మి.మీ వెడల్పు, 9.10 మి.మీ మందం, 199.6 గ్రాముల బరువు ఉంది.











