భారత్‌లో లాంచైన itel A05s 4GB+64GB వేరియంట్; ధర రూ.6,099 మాత్రమే!

Highlights

  • భారత్ లో లాంచైన itel A05s
  • 4జిబి వర్చువల్ ర్యామ్‌తో వచ్చిన డివైజ్
  • itel A05s ధర రూ.6,099 మాత్రమే

చవక ఫోన్ల తయారీలో గుర్తింపు తెచ్చుకున్న సంస్థ itel నుంచి తాజాగా భారతీయ మార్కెట్ లోకి itel A05s 4జిబి+64జిబి వేరియంట్ విడుదలైంది. ఇప్పటికే 2జిబి+32జిబి మోడల్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. కాగా, 4జిబి+64జిబి మోడల్ ధర రూ.6,099 మాత్రమే కావడం విశేషం. ఈ ఫోన్ 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీంతో యూజర్ కి గరిష్టంగా 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. సరే, ఓసారి itel A05s డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

itel A05s ధర, కలర్ ఆప్షన్స్

itel A05s డివైజ్ సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.6,099 గా నిర్ణయించారు. క్రిస్టల్ బ్లూ, గ్లోరియస్ ఆరెంజ్, మీడో గ్రీన్, నెబులా బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

itel A05s స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: itel A05s లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్ రెజుల్యూషన్, ఐపీఎస్ ప్యానెల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: itel A05s లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 4జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: itel A05s డివైజ్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై పని చేస్తుంది.
  • ప్రాసెసర్: itel A05s స్మార్ట్‌ఫోన్ లో యూనిఎస్ఓసీ స్ప్రెడ్‌ట్రమ్ 9863ఏ చిప్సెట్ ఉంది.
  • కెమెరా: itel A05s లో 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా ఉంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: itel A05s లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
  • ఇతర ఫీచర్లు: itel A05s లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.