Google Play Console పై కనిపించిన Vivo V30 Lite; రివీలైన రెండర్ ఇమేజ్, ప్రధాన స్పెసిఫికేషన్స్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 Lite
  • రివీలైన గూగుల్ ప్లే కన్సోల్, బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్స్
  • కర్వ్డ్ ఎడ్జ్ స్క్రీన్ తో వస్తోన్న Vivo V30 Lite

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 Lite డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ తాజాగా గూగుల్ ప్లే కన్సోల్ మరియు బ్లూటూత్ ఎస్‌ఐజీ సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని TheTechOutlook తన కథనంలో వెల్లడించింది. ఇక లిస్టింగ్స్ ద్వారా Vivo V30 Lite యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ మరియు రెండర్ ఇమేజ్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo V30 Lite గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

  • Vivo V30 Lite డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్ సైట్ పై V2317 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • 12జిబి ర్యామ్, వైట్-పర్పుల్ కలర్ వేరియంట్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది.
  • Vivo V30 Lite డివైజ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, అడ్రెనో 619 జీపీయూ, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 440 డీపీఐ స్క్రీన్ డెన్సిటీతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.
  • Vivo V30 Lite రెండర్ ఇమేజ్ విషయానికి వస్తే, కొత్తగా లాంచైన ఇతర వివో ఫోన్ల మాదిరే Vivo V30 Lite కనిపిస్తోంది. కర్వ్డ్-ఎడ్జ్ ప్యానెల్, సెంటర్ పంచ్ హోల్ కటౌట్, రెక్టాంగ్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్, ఆరా రింగ్, ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్ ఉన్నాయి.
  • Vivo V30 Lite లో కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఉన్నాయి.

Vivo V30 Lite బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్

  • Vivo V30 Lite డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ పై D062272 అనే డిక్లరేషన్ ఐడీతో సర్టిఫై అయ్యింది.
  • బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ సైట్ లిస్టింగ్ ప్రకారం Vivo V30 Lite డివైజ్ బ్లూటూత్ 5.1 తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • బ్లూటూత్ ఎస్ఐజీ డేటాబేస్ లో Vivo V30 Lite డివైజ్ V2314 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.