భారత్ లో లాంచైన Itel P55 5G; ధర రూ.9,699 మాత్రమే!

Highlights

  • అమెజాన్ లో లిస్టైన Itel P55 5G
  • 12జిబి ర్యామ్ పవర్ తో రానున్న డివైజ్
  • Itel P55 5G ధర రూ.9,699

చవకైన ఫోన్లను లాంచ్ చేస్తూ Itel సంస్థ తక్కువ సమయంలోనే యూజర్లను ఆకర్షించగలిగింది. మెల్లగా ఈ బ్రాండ్ ఫోన్ల వైపు యూజర్లు దృష్టి పెడుతున్నారు. వరుసబెట్టి భారతీయ మార్కెట్ లో ఐటెల్ సంస్థ ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది. తాజాగా Itel S23+ డివైజ్ తో పాటు Itel P55 5G ని లాంచ్ భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. Itel P55 5G అమెజాన్ ద్వారా సేల్ కి రానుంది. ఈ ఫోన్ అక్టోబర్ 4 న ఈ సేల్ మొదలవుతుంది. సరే, ఓసారి Itel P55 5G డివైజ్ ధర, డిజైన్, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Itel P55 5G ధర

Itel P55 5G స్మార్ట్ ఫోన్ సేల్ అక్టోబర్ 4 నుంచి మొదలు కానుంది. 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభించనున్న ఈ ఫోన్ ధరను రూ.9,699 గా నిర్ణయించినట్లు సమాచారం.

Itel P55 5G డిజైన్

  • Itel P55 5G ఫోన్ బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. బ్యాక్ ప్యానెల్ పై మిక్స్‌డ్ కలర్ టెక్షర్ ఉంటుంది.
  • ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా కటౌట్స్ ఉన్నాయి. ఇంకా ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. అలాగే 50ఎంపి ఏఐ కెమెరా, 5జీ బ్రాండింగ్ ఉన్నాయి.
  • Itel P55 5G లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింటస్ స్కానర్ అందిస్తున్నారు. పవర్ బటన్ లో ఇది ఉంటుంది.
  • ఫోన్ ముందు వైపు వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే ఉంది.

Itel P55 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Itel P55 5G లో 6.6-ఇంచ్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Itel P55 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • మెమొరీ: Itel P55 5G లో 12జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, 6జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి.
  • కెమెరా: Itel P55 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఒక ఏఐ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఏఐ సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు.
  • బ్యాటరీ: Itel P55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Itel P55 5G డివైజ్ 10 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

Itel P55 5G స్మార్ట్ ఫోన్ పై కంపెనీ 2 ఏళ్ళ వ్యారంటీ అందిస్తోంది. ఇందులో భాగంగా ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ సదుపాయం కూడా అందిస్తున్నారు.