
చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ itel నేడు భారతీయ మార్కెట్ లో itel P55 మరియు itel P55+ అనే డివైజెస్ ని లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఐటెల్ ఈ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ కొత్త ఐటెల్ స్మార్ట్‌ఫోన్లు 6.6-ఇంచ్ 90 హెర్ట్జ్ స్క్రీన్, ఎక్స్‌పాండబుల్ ర్యామ్ ఫీచర్ టెక్నాలజీతో 16జిబి ర్యామ్, రూ.7,499 ప్రారంభ ధరతో మార్కెట్ లోకి వచ్చాయి. సరే, ఓసారి itel P55 మరియు itel P55+ డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
itel P55 ధర
- itel P55 స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- itel P55 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,499 గా ఉంది.
- itel P55 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,499 గా ఉంది.
- itel P55 కొనుగోలుపై రూ.500 డిస్కౌంట్ ని కంపెనీ ప్రకటించింది. దీంతో రెండు వేరియంట్స్ వరుసగా రూ.6,999 మరియు రూ.8,999 ధరలకు లభించనున్నాయి.
itel P55+ ధర
- itel P55+ డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
- itel P55+ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.9,999 గా నిర్ణయించారు.
- ఈ ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.9,499 కి చేరుతుంది.
- ఫిబ్రవరి 13 నుంచి ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది.
itel P55 మరియు itel P55+ స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: itel P55 మరియు itel P55+ డివైజెస్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: itel P55 మరియు itel P55+ డివైజెస్ లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ యొక్క మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 1.6 గిగాహెర్ట్జ్.
- కెమెరా: itel P55, itel P55+ ఫోన్లలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్లలో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- ర్యామ్: itel P55+ డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి ఎక్స్‌పాండబుల్ ర్యామ్, itel P55 డివైజ్ 4జిబి ర్యామ్/8జిబి ర్యామ్, 8జిబి వరకు ఎక్స్‌పాండబుల్ ర్యామ్ తో వచ్చాయి.
- స్టోరేజీ: itel P55 ఫోన్ 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, itel P55+ డివైజ్ 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో లాంచ్ అయ్యాయి.
- కెమెరా: itel P55, itel P55+ డివైజెస్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ, చార్జింగ్: itel P55 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. itel P55+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
- సెక్యూరిటీ: భద్రత కోసం రెండు ఫోన్లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
- కనెక్టివిటీ: itel P55, itel P55+ డివైజెస్ లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
- కలర్ ఆప్షన్స్: itel P55+ రాయల్ గ్రీన్, మీటియోర్ పర్పుల్ మరియు మీటియోర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. itel P55 మూన్‌లిట్ బ్లాక్, అరోరా బ్లూ మరియు బ్రిలియంట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.












