
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలో భారత్ లో iQOO Neo 7 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ కోసం ఐకూ లవర్స్ ఎంతగానో వేచిచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా iQOO Neo 7 Pro ఫోన్ వివరాలు లీక్ అవుతూ వస్తున్నాయి. నేడు కంపెనీ iQOO Neo 7 Pro డివైజ్ లాంచ్ తేదీని రివీల్ చేసింది. జులై 4 న ఈ డివైజ్ భారత్ లో లాంచ్ అవుతోంది. అంచనా స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
iQOO Neo 7 Pro ఇండియా లాంచ్ వివరాలు
iQOO ఇండియా తన ట్విట్టర్ హ్యాండిల్ బ్యానర్ ని మార్చింది. మార్చిన ఫోటోలో iQOO Neo 7 Pro లాంచ్ తేదీ ఉంది. దాని ప్రకారం iQOO Neo 7 Pro డివైజ్ జులై 4 న లాంచ్ కానుందని తెలిసింది. ఇప్పటి వరకు లాంచ్ తేదీ గురించి ప్రెస్ రిలీజ్, సోషల్ మీడియా పోస్ట్ ని ఐకూ వెలువరించలేదు. ఈ ఫోన్ ని పవర్ టు విన్ అనే టైటిల్ తో కంపెనీ ప్రమోట్ చేస్తోంది.
iQOO Neo 7 Pro ఇండియా ధర (లీక్)
రీసెంట్ లీక్స్ ప్రకారం, iQOO Neo 7 Pro డివైజ్ భారత్ లో 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ లో కూడా లాంచ్ కానుంది. దీని ధర రూ.40,000 గా ఉంటుందని అంచనా. బేస్ వేరియంట్ ధర రూ.32,000 నుంచి మొదలవుతుందని సమాచారం.
iQOO Neo 7 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: iQOO Neo 7 Pro 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+ ఉన్నాయి.
- ప్రాసెసర్: iQOO Neo 7 Pro 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 730 జీపీయూ ఉన్నాయి.
- మెమొరీ, స్టోరేజీ: iQOO Neo 7 Pro 5G లో 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ మరియు 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
- సాఫ్ట్ వేర్: iQOO Neo 7 Pro 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కెమెరా: iQOO Neo 7 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి శాంసంగ్ ఐసోసెల్ జీఎన్5 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, వీ1+ చిప్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ, చార్జింగ్: iQOO Neo 7 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫ్లాష్‌చార్జ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా యూఎస్బీ 2.0 టైప్ సీ పోర్ట్ అందించారు.
- కనెక్టివిటీ, సెక్యూరిటీ: iQOO Neo 7 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
- కలర్స్, ఆడియో: iQOO Neo 7 Pro 5G డివైజ్ లో స్టీరియో స్పీకర్, టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆరెంజ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- డైమెన్షన్స్, వెయిట్: iQOO Neo 7 Pro 5G డివైజ్ 164.72 మి.మీ పొడవు, 77.0 మి.మీ వెడల్పు, 8.53 మి.మీ మందం, 194.6 గ్రాముల బరువు ఉంటుంది.












