రివీల్ అయిన itel Vision సిరీస్ కొత్త ఫోన్ డిజైన్

హైలైట్స్:

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న itel Vision సిరీస్ నయా స్మార్ట్ ఫోన్
  • డ్యూయల్ రియర్ కెమెరాలు, రియర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, వాటర్ డ్రాప్ నాచ్ తో రానున్న ఫోన్
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న itel Vision

itel కంపెనీ త్వరలో భారత్ లో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని 91మొబైల్స్ ఎక్స్‌క్లూజివ్ గా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుసుకుంది. మేం itel Vision యొక్క రెండర్ ఇమేజ్ ని రాబట్టగలిగాం. దీని ద్వారా ఫోన్ యొక్క డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది. మెరుగైన పెర్ఫామెన్స్ ని ఈ ఫోన్ అందించగలదని కంపెనీ చెబుతోంది. ఈ హ్యాండ్సెట్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. ఐటెల్ బ్రాండ్ యొక్క Vision సిరీస్ లో వస్తున్న ఈ లేటెస్ట్ ఫోన్ రెండితలు వేగవంతమైన పెర్ఫామెన్స్ ని అందించనుందని ఇటీవలె విడుదలైన itel Vision సిరీస్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.

త్వరలో లాంచ్ కానున్న itel Vision సిరీస్ కొత్త ఫోన్ ధర రూ.8,000 లోపు ఉండే అవకాశముందని సన్నిహిత వర్గాలు మాకు తెలిపాయి. ఫోన్లో డ్యూయల్ కెమెరాలు, బ్యాక్ ప్యానెల్ పై ప్యాటెర్న్ డిజైన్ ఉన్నట్లు రెండర్ ఇమేజ్ ద్వారా అర్థమవుతోంది. ఈ హ్యాండ్సెట్ లో 5000 ఎంఏహెచ్ లిథియమ్ పాలిమర్ బ్యాటరీ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

itel Vision సిరీస్ ఫోన్ యొక్క డిజైన్

త్వరలో లాంచ్ కానున్న itel Vision స్మార్ట్ ఫోన్ డిజైన్ రెండర్ ఇమేజ్ ద్వారా రివీల్ అయ్యింది. ఫోన్లో వాటర్ డ్రాప్ నాచ్ కనిపిస్తోంది. నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే గుర్తించదగిన చిన్ బాటమ్ లో కనిపిస్తోంది. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కనిపిస్తున్నాయి.

ఫోన్ వెనకాల చూస్తే, రెక్టాంగ్యులర్ ఐల్యాండ్ లో డ్యూయల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. కెమెరా మాడ్యూల్ లో ఏఐ సూపర్ కెమెరా అని రాసి ఉంది. ఫోన్ భద్రత కోసం రియర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. ఇమేజ్ లో ఫోన్ నీలం రంగులో కనిపిస్తోంది. ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశముంది.

itel Vision ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరాలు, 18వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తోందని మనం తెలుసుకున్నాం. అయితే ఇతర స్పెసిఫికేషన్స్ ఇంకా రహస్యంగానే ఉన్నాయి. రీసెంట్ గా ఐటెల్ నుంచి విడుదలైన టీజర్ ఇమేజ్/క్లిప్ ద్వారా ఈ ఫోన్ 3జిబి ర్యామ్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. అయితే ఇందులో 3జిబి ఎక్స్‌టెండబుల్ ర్యామ్ కూడా ఉన్నట్లు సమాచారం.

itel Vision ఫోన్ ధర రూ.8000 లోపు ఉండే అవకాశం ఉంది. రూ.10,000 ధరల శ్రేణిలో వరుసగా రెండు త్రైమాసికాలు itel కంపెనీ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు రానున్న itel Vision తో ఈ సంస్థ ఆ శ్రేణిలో మరింత పటిష్టమయ్యే అవకాశాలున్నాయి.