హైలైట్స్:
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానున్న iQOO 11
- శాంసంగ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే తో వస్తోన్న iQOO 11 ఫ్లాగ్షిప్
- నవంబర్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ని లాంచ్ చేయనున్న క్వాల్కమ్ కంపెనీ
వివో సబ్-బ్రాండ్ అయిన iQOO ఐకూ 10, ఐకూ 10 ప్రో ఫోన్లను చైనాలో ఈ ఏడాది మొదట్లో లాంచ్ చేసింది. దాని తర్వాత, భారత్ లో iQOO 9T 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ తో వచ్చింది. ఇప్పుడు ఈ కంపెనీ iQOO 11 సిరీస్ పై పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ Snapdragon 8 Gen 2 చిప్ తో వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, iQOO 11 Pro SM8550 ప్లాట్‌ఫామ్ తో వస్తుందని తెలిపింది. ఇది స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 అని తెలుస్తోంది. నవంబర్ రెండో వారంలో స్నాప్ డ్రాగన్ 8 జెన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అటు తర్వాత సరిగ్గా 3 నెలలకు iQOO 11 లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
నెక్ట్స్ జనరేషన్ Samsung E6 AMOLED డిస్ప్లే, పంచ్ హోల్ డిజైన్ తో iQOO 11 వస్తున్నట్లు టిప్‌స్టర్ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ 2కే రెజుల్యూషన్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 144హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది.
జూన్ లో iQOO చైనాలో ఐకూ 10 సిరీస్ ని లాంచ్ చేసింది. తర్వాత నెల గడవక ముందే, భారత్ లో iQOO 9T 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇది ఐకూ 10 మాదిరి ఫీచర్లనే కలిగి ఉంది.
iQOO 9T స్పెసిఫికేషన్స్
- 6.78-ఇంచ్ ఈ5 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్
- 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ
- 50ఎంపి + 13ఎంపి + 12ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
- 16ఎంపి ఫ్రంట్ కెమెరా
- 4700ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్
iQOO 9T 5G 6.78 అంగుళాల Samsung E5 AMOLED డిస్ప్లే, FHD+ రెజుల్యూషన్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ని కలిగి ఉంది. iQOO 9T 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి జీఎన్5 సెన్సర్, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సర్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి.
భారత్ కి iQOO 10 Pro డివైజ్ ని ఐకూ తీసుకొస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. ఐకూ 9 ప్రో లాంచ్ అయ్యింది కనుక, ఐకూ 10 ప్రో ని భారత్ లో లాంచ్ చేయకుండా, iQOO 11 ని డైరెక్ట్ గా లాంచ్ చేసే అవకాశముంది. ఏం జరగనుందో తెలియాలంటే, మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.












