Home List Jio 5G Plans: మీ 5జీ ఫోన్ కోసం బెస్ట్ జియో 5జీ ప్లాన్స్

Jio 5G Plans: మీ 5జీ ఫోన్ కోసం బెస్ట్ జియో 5జీ ప్లాన్స్

Highlights
  • జియో వద్ద ఉన్న అపరిమిత 5జీ ప్లాన్స్
  • అన్ని బడ్జెట్స్ లో అందుబాటులో ప్లాన్స్
  • బెస్ట్ జియో 5జీ ప్లాన్స్ వివరాలు మీకోసం

భారతదేశంలో ఉన్న టాప్ టెలీకామ్ కంపెనీల్లో Jio ఒకటి. ప్రస్తుతం ఈ సంస్థ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోపక్క జియోకి ఎయిర్టెల్ గట్టి పోటీ ఇస్తోంది. ఇక వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో ఉంది. ప్రభుత్వ రంగ టెలీకామ్ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్వర్క్ ని దేశ వ్యాప్తంగా విస్తరింపజేసే పనుల్లో నిమగ్నమైంది. దీని తర్వాత 5జీ నెట్వర్క్ ని కూడా అతి త్వరలోనే అందించాలని సదరు సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక రిలయన్స్ జియో విషయానికి వస్తే, ఈ సంస్థ తన యాన్యువల్ జనరల్ మీటింగ్ లో 5జీ ప్లాన్స్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్లాన్స్ ధరలు 4జీ ప్లాన్స్ మాదిరే ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే, ప్రస్తుతం 4జీ ప్లాన్స్ పైనే 5జీ సేవలను జియో అందిస్తోంది. అలా అపరిమిత 5జీ సర్వీస్ లభించే బెస్ట్ జియో 5జీ ప్లాన్స్ ఏంటో ఇక్కడ మీకోసం అందిస్తున్నాం. ఓసారి చెక్ చేయండి.

బెస్ట్ జియో 5జీ ప్లాన్స్

జియో రూ.239 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.239 ప్లాన్ ద్వారా కస్టమర్ కి అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ ద్వారా ఇంకా 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత ఉచిత కాల్స్, డెయిలీ 1.5జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. 5జీ డేటా ఎలిజిబుల్ కస్టమర్లకు మాత్రమే లభించనుంది.

రూ.269 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.269 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ డేటా లభిస్తుంది. ఈ డేటా ఎలిజిబుల్ యూజర్లకు లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత ఉచిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియో సావన్ ప్రో, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

జియో రూ.299 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ డేటా లభిస్తుంది. ఈ డేటా ఎలిజిబుల్ కస్టమర్లకు వర్తిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

జియో రూ.349 ప్లాన్ ప్రయోజనాలు

జియో తీసుకొచ్చిన రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ డేటా లభిస్తుంది. ఈ డేటా ఎలిజిబుల్ కస్టమర్లకు వర్తిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు 30 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2.5జిబి డేటా, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.399 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.399 ప్లాన్ ద్వారా కస్టమర్ కి అన్‌లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. ఈ డేటా ఎలిజిబుల్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 3జిబి డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.666 ప్లాన్ ప్రయోజనాలు

జియో తీసుకొచ్చిన రూ.666 ప్లాన్ ద్వారా కస్టమర్లకు అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత ఉచిత కాల్స్, డెయిలీ 1.5జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే అపరిమిత 5జీ సేవలు ఎలిజిబుల్ కస్టమర్లకు మాత్రమే లభిస్తాయి.

రూ.719 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.719 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, అపరిమిత ఉచిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అపరిమిత 5జీ డేటా ఎలిజిబుల్ కస్టమర్లకు మాత్రమే లభిస్తుంది.

రూ.749 ప్లాన్ ప్రయోజనాలు

జియో తీసుకొచ్చిన రూ.749 ప్లాన్ ద్వారా కస్టమర్లకు అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ డేటా లభిస్తుంది. ఇంకా డెయిలీ 2జిబి డేటా, 90 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 100 ఎస్ఎంఎస్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అపరిమిత 5జీ డేటా ఎలిజిబుల్ కస్టమర్లకు మాత్రమే లభిస్తుంది.

రూ.999 ప్లాన్ ప్రయోజనాలు

జియో ఆఫర్ చేస్తున్న రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అన్‌లిమిటెడ్ ట్రూ 5జీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 3జిబి డేటా, అపరిమిత ఉచిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అపరిమిత 5జీ డేటా ఎలిజిబుల్ కస్టమర్లకు మాత్రమే లభిస్తుంది.