OPPO K12x 5G: 45W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో కే12ఎక్స్ 5జీ

Highlights

  • నేడు భారత్‌లో OPPO K12x 5G లాంచ్
  • 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ54 రేటింగ్
  • OPPO K12x 5G ప్రారంభ ధర రూ.12,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారత్ లో ఒక కొత్త కే-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. OPPO K12x 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ డివైజ్ లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ54 రేటింగ్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO K12x 5G ధర, లభ్యత

OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో భారత్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

OPPO K12x 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.12,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు.

OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఆగస్టు 2వ తేదీ నుంచి మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్, ఒప్పో వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ బ్రీజ్ బ్లూ మరియు మిడ్నైట్ వాలెట్ కలర్స్ లో లభిస్తుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, OPPO K12x 5G డివైజ్ కొనుగోలుపై రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యాక్సిస్ బ్యాంక్ ద్వారా జరిపే లావాదేవీలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

OPPO K12x 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO K12x 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: OPPO K12x 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: OPPO K12x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 32ఎంపి అల్ట్రా-క్లియర్ ఏఎఫ్ మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: OPPO K12x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: OPPO K12x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO K12x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO K12x 5G లో ఐపీ54 రేటింగ్, ఏఐ లింక్ బూస్ట్ టెక్నాలజీ, ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉన్నాయి. ఏఐ లింక్ బూస్ట్ ఫీచర్ ద్వారా తక్కువ నెట్వర్క్ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో కూడా మంచి నెట్వర్క్ అందుతుంది.