హైలైట్స్
- భారత్ లో లాంచైన Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్
- కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 108ఎంపి కెమెరాతో వచ్చిన Realme 10 Pro+
- Realme 10 Pro+ ప్రారంభ ధర రూ.24,999, డిసెంబర్ 14 నుంచి సేల్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నేడు భారత్ లో Realme 10 Pro మరియు Realme 10 Pro+ ఫోన్లను లాంచ్ చేసింది. Realme 10 Pro+ కర్వ్డ్ డిస్ప్లే తో వచ్చింది. Realme 10 Pro లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడగా, Realme 10 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ వాడారు. రెండు డివైజెస్ 5జీ కనెక్టివిటీతో వచ్చాయి. ఈ ఆర్టికల్ లో Realme 10 Pro+ గురించి తెలుసుకుందాం పదండి.
Realme 10 Pro+ స్పెసిఫికేషన్స్
Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ టెక్నాలజీ, 61-డిగ్రీ స్క్రీన్ కర్వేచర్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 ఎంసీ4 జీపీయూ వినియోగించారు.
12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
భద్రత కోసం Realme 10 Pro+ లో ఇన్-డిస్ప్లే పింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. ఇంకా ఎక్స్-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటర్, స్టీరియో స్పీకర్స్, హై-రెస్ ఆడియో, 4డీ గేమింగ్ వైబ్రేషన్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ డివైజ్ 7.78 మిల్లీ మీటర్ల మందం, 173 గ్రాముల బరువు ఉంటుంది. 5జీ SA/NSA, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్/గ్లొనాస్/బైడూస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
ఇప్పుడు Realme 10 Pro+ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎమ్6 మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
భారత్ లో Realme 10 Pro+ ధర, విక్రయ తేదీ
Realme 10 Pro+ డిసెంబర్ 14 నుంచి సేల్ కి వస్తోంది. ఫ్లిప్ కార్ట్, రియల్మీ.కామ్ మరియు ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. Realme 10 Pro+ 6జిబి+128జిబి వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. 8జిబి+128జిబి మోడల్ ధర రూ.25,999 గా నిర్ణయించారు. ఇక టాప్ మోడల్ 8జిబి+256జిబి వర్షన్ ధర రూ.27,999 గా ఉంది. Realme 10 Pro+ డివైజ్ నెబులా బ్లూ, డార్క్ మ్యాటర్, హైపర్స్పేస్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












