108MP కెమెరాతో వస్తున్న Moto G72, ధర రూ.15,000

హైలైట్స్:

  • 108ఎంపి కెమెరా ఫోన్ ని లాంచ్ చేస్తున్న మోటోరోలా
  • దాదాపు రూ.15,000 ధరతో ఎంట్రీ ఇవ్వనున్న Moto G72 స్మార్ట్ ఫోన్
  • అక్టోబర్ 3 న భారత్ లో లాంచ్ అవుతోన్న Moto G72

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా Moto G72 అనే మిడ్-రేంజ్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఫోన్ లాంచ్ ని మోటోరోలా అఫీషియల్ గా ప్రకటించింది. అలాగే షాపింగ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో Moto G72 యొక్క ప్రోడక్ట్ పేజీ కూడా దర్శనమిస్తోంది. 108 మెగాపిక్సెల్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీఓఎల్ఈడీ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లను కంపెనీ రివీల్ చేసింది.

Moto G72 లాంచ్

మోటోరోలా తన జీ-సిరీస్ ను ఇంకా విస్తరిస్తూ పోతోంది. Moto G72 లాంచ్ తేదీని ట్విట్టర్ ద్వారా మోటోరోలా ప్రకటించింది. అక్టోబర్ 3 న Moto G72 లాంచ్ చేయబోతున్నట్లు తన ట్వీట్ లో పేర్కొంది. అలాగే ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. అక్టోబర్ 3 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అయ్యాక ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ సేల్స్ మొదలవుతాయి. మిటియోరైట్ గ్రే, పోలార్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

Moto G72 స్పెసిఫికేషన్స్

Moto G72 లో ఓఎల్ఈడీ పంచ్ హోల్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 576హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, డీసీఐ పీ3 కలర్ గేముత్, హెచ్డీఆర్10 సపోర్ట్ ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ని ఇందులో అమర్చారు. ఇది 6 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైంది. Moto G72 6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, ఐపీ52 రేటింగ్, డాల్బీ అట్మాస్ ని కలిగి ఉంది.

ఇప్పుడు Moto G72 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Moto G72 లో 108ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉంది. అలాగే దీంతో పాటు ఒక అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, ఒక మ్యాక్రో సెన్సర్ ఉండనున్నాయి. Moto G72 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జ్ కి సపోర్ట్ చేస్తుంది. Moto G72 ధర రూ.15,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇటీవలె మోటోరోలా కంపెనీ మోటో ఎడ్జ్ 30 అల్ట్రా, మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఫోన్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు కూడా ఫ్లాగ్షిప్ కేటగిరీ ఫోన్లు. హై-ఎండ్ ఫోన్లను తీసుకొస్తుండటంతో పాటు మరోవైపు లో-ఎండ్, మిడ్-రేంజ్ ఫోన్లను లాంచ్ చేస్తూ పోతున్న మోటోరోలా బ్రాండ్ మార్కెట్ లో తన పట్టుని పెంచుకుంటోంది. అందుబాటు ధరలో అధిక ఫీచర్లను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది. జనాలు కూడా మోటోరోలా ఫోన్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎక్కువ ఫీచర్లు, క్లీన్ యూఐ మోటోరోలా ఫోన్ల ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous articleఅక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Xiaomi 12T, 12T Pro
Next articleలీకైన Jio Phone 5G స్పెసిఫికేషన్స్: Snapdragon 480 చిప్, 90Hz రిఫ్రెష్ రేట్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.