
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో X100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఇది గత మోడల్ Vivo X90 సిరీస్ కి సక్సెసర్ గా వస్తోంది. Vivo X100 5G డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ తాజాగా నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. Vivo X100 5G మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్, 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు సమాచారం. సరే, ఓసారి Vivo X100 5G డివైజ్ లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.
Vivo X100 5G లాంచ్ టైమ్‌లైన్
Vivo X100 సిరీస్ తొలుత చైనాలో లాంచ్ కానుందని The Tech Outlook ఒక కథనాన్ని ప్రచురించింది. తర్వాత భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి Vivo X100 సిరీస్ ప్రవేశించనుందని టెక్ ఔట్‌లుక్ తెలిపింది.
Vivo X100 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Vivo X100 5G డివైజ్ లో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: Vivo X100 5G స్మార్ట్ ఫోన్ లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
- చిప్సెట్: Vivo X100 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8 సిరీస్ చిప్సెట్ ఉంటుందని అంచనా. రూమర్లను బట్టి, Vivo X100 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్ ఉండే చాన్స్ ఉంది.
- బ్యాటరీ: Vivo X100 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్‌వేర్: Vivo X100 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











