Home News కేరళలోని కొచ్చిలో ఫాస్టెస్ట్ ఈవీ చార్జర్ ని ఇన్‌స్టాల్ చేసిన Kia

కేరళలోని కొచ్చిలో ఫాస్టెస్ట్ ఈవీ చార్జర్ ని ఇన్‌స్టాల్ చేసిన Kia

హైలైట్స్:

కేరళ లోని కొచ్చి డీలర్షిప్ లో కియా ఇండియా తన లేటెస్ట్ ఫాస్ట్ చార్జర్ ని నెలకొల్పింది. గురుగ్రామ్ లో గత నెలలో తన తొలి ఫాస్ట్ చార్జర్ ని లాంచ్ చేశాక తాజాగా కేరళలో మరొక ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ ని ప్రారంభించింది. గురుగ్రామ్ లో ఇన్‌స్టాల్ చేసిన ఫాస్ట్ చార్జర్ 150 కిలో వాట్ సామర్థ్యం కలిగింది. కాగా, కేరళ లోని కొచ్చి డీలర్షిప్ లో ప్రారంభించిన 240 కిలో వాట్ చార్జర్ దేశంలోనే ఫాస్టెస్ట్ ఈవీ చార్జర్. కియా యొక్క సొంత కియా ఈవీ6 ఎలక్ట్రిక్ క్రాసోవర్, 350 కిలో వాట్ వరకు చార్జ్ అవుతుంది. అలాగే 18 నిమిషాల్లో 10 నుంచి 50 శాతం వరకు చార్జ్ అవుతుంది. ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎక్కువ సేపు చార్జింగ్ స్టేషన్ల వద్ద వేచి ఉండే అవసరం ఉండదు. ఎలక్ట్రిక్ మొబిలిటీ టెక్నాలజీకి మారుతోన్న ఈ తరుణంలో ఇది ఎంతో అవసరం.

దేశంలో అత్యంత వేగవంతమైన చార్జర్ ని నెలకొల్పిన Kia India

అన్ని బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు చార్జ్ చేసుకునేందుకు వీలుగా కియా ఇండియా, గురుగ్రామ్ నగరంలో 150 కిలో వాట్ ఫాస్ట్ చార్జర్ ని లాంచ్ చేసింది. దేశ వ్యాప్తంగా 12 నగరాల్లో మరో 15 150 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్స్ ను ఏర్పాటు చేయాలని కియా ఇండియా ప్రణాళికలు రచిస్తోంది. త్వరలోనే ఇవి ఇన్‌స్టాల్ అయ్యే అవకాశముంది.

ఇప్పుడు కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ ఏమంటున్నారో తెలుసుకుందాం. “కియా ఇండియాకు ఇది ఎంతో ముఖ్యమైన మైలురాయి. మేం ఇలాగే ఈవీ ఇన్ఫాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేస్తూ, భారత్ యొక్క మొబిలిటీ గ్రోత్ కి మా వంతు కంట్రిబ్యూషన్ ని అందిస్తూ ఉంటాం.” అని కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యూంగ్-సిక్ సోహన్ అన్నారు. “భారత్ లో మా యొక్క ఈవీ ప్రయాణం ఇంతటితో ఆగిపోదు. రేంజ్ యాంగ్జైటీ, చార్జింగ్ టైమ్ వంటి సమస్యలను తీర్చేందుకై మా యొక్క ఈవీ డీలర్షిప్స్ వద్ద చార్జింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయడంపై మేం పని చేస్తున్నాం.” అని మ్యూంగ్-సిక్ సోహన్ అన్నారు.

కియా ఇండియా కేవలం దేశంలో చార్జింగ్ నెట్వర్క్ లను నెలకొల్పడం పైనే పని చేయడం లేదు, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి తీసుకు రావాలని భావిస్తోంది. ఈ కొరియన్ కార్ల తయారీ సంస్థ రీసెంట్ గా కియా ఈవీ6 ప్రీమియమ్ క్రాసోవర్ వాహనాన్ని భారత్ లో లాంచ్ చేసింది. కియా ఈవీ6, బీఎండబ్ల్యూ ఐ4 తో పోటీ పడనుంది. కియా-హ్యుందాయ్ త్వరలోనే హ్యాందాయ్ కోనా ఈవీ ఫేస్ లిఫ్ట్, హ్యుందాయ్ ఐయానిక్, కియా నీరో ఈవీ తదితర వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేయనున్నాయి.