Home News మెరుగైన ఫైర్-రెసిస్టంట్ ఈవీ బ్యాటరీని అభివృద్ధి చేసిన Komaki

మెరుగైన ఫైర్-రెసిస్టంట్ ఈవీ బ్యాటరీని అభివృద్ధి చేసిన Komaki

హైలైట్స్:

 ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న బ్యాటరీలతో పోలిస్తే, మరింత మెరుగైన ఫైర్ రెసిస్టంట్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్యాటరీని తాము తయారు చేశామని కొమాకి అనే కంపెనీ ప్రకటించింది. బ్యాటరీకి కొత్త కెమికల్ కంపోజిషన్ వాడటంతో పాటు, ఓ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్, సెన్సర్స్ ను వాడాలని కొమాకి ప్లాన్ చేస్తోంది. ఈ అప్లికేషన్ ద్వారా బ్యాటరీ హెల్త్ ని మానిటర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా రెండు విధాలుగా ప్రమాదాన్ని నివారించడం ద్వారా, భద్రతతో కూడిన ఈవీ ఎక్స్‌పీరియన్స్ ని అందించాలని కొమాకి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ళు పెరిగాయి. అయితే, క్వాలిటీ, రిలైబులిటీ విషయంలో ఎంతో పరిణితి రావాల్సి ఉంది. ఆర్ అండ్ డీ మరియు యూసేజ్ గ్రోత్ లో వ్యత్యాసం వెరసి ఎన్నో ఈ-స్కూటర్లు దగ్ధమవ్వాడానికి కారణమవుతున్నాయి. కొమాకి ఈవీస్ తో పాటు మల్టీ బ్రాండ్స్ ని అమ్మే పుణె లోని ఒక డీలర్షిప్ లో వెహికిల్స్ తగులబడ్డాయి. దీంతో ప్రభుత్వం కూడా మొత్తం మూడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు నోటీసులు పంపించింది. అలాగే ఇటువంటి ఘటనల నేపథ్యంలో ఈవీ మేకర్స్ కి కొత్త మార్గదర్శకాలను నిర్దేశించింది.

ఫైర్-సేఫ్ ఈవీ బ్యాటరీలు (Fire-safe EV batteries)

కొమాకి బ్యాటరీలు లిథియమ్-అయాన్ ఫెర్రో పాస్పేట్ (LiFePO4) అనే కొత్త సమ్మేళనంతో తయారవుతున్నాయి. మిగతా వాటికంటే ఇవి థిరియాటికల్ గా అధిక ఫైర్-రిసిస్టన్స్ ని కలిగి ఉండనున్నాయి. అయితే కొమాకి చెబుతున్న దాన్ని, అథారిటీస్ వెరిఫై చేయాల్సి ఉంది.

బ్యాటరీల్లో వాడే ఒక వంతు సెల్స్ యొక్క వినియోగాన్ని కొమాకి తగ్గించనుంది.
బ్యాటరీల్లో ఉద్భవించే వేడిమిని ఇది కంట్రోల్ చేయగలదు. అత్యధికంగా 2500-3000 లైఫ్ సైకిల్ వరకు బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచవచ్చని కంపెనీ చెబుతోంది. సాధారణ ఎన్ఎంసీ (నికెల్, మాంగనీస్, కోబాల్ట్) బ్యాటరీల యొక్క 800 లైఫ్ సైకిల్ తో పోల్చితే ఇది ఎంతో అధికం.

కంపోనెంట్స్ ని తగ్గించడం ద్వారా సర్వీస్ ప్రొవైడర్లకు వెహికిల్స్ తో భద్రంగా పని చేసేట్లు చేయాలనేది కొమాకి లక్ష్యమని తెలుస్తోంది. ఇక బైక్ వెళ్తున్నప్పుడు బ్యాటరీ డ్యామేజ్ కాకుండా చాలా వరకు నివారించబడుతుంది.

స్మార్ట్ ఫోన్ లో ఒక యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని బ్యాటరీ హెల్త్ ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయవచ్చు. సెన్సర్స్ ద్వారా ఈ సమాచారం యూజర్ కి వెళ్తుంది. దీని ద్వారా ఇటు యూజర్, అటు డీలర్షిప్ కి వెహికిల్ యొక్క అనుమానస్పద శైలి గురించి తెలుస్తుంది. ఒక్క ఉదుటున, 250 బ్యాటరీలను పరీక్షించగల సామర్థ్యం ఈ అప్లికేషన్ కి ఉంది. అలాగే సెకనుల వ్యవధిలో మళ్ళీ మళ్ళీ ఈ ప్రక్రియను చేయగలదు. ఇవన్నీ కలగలిసి బ్యాటరీ పేలుడు, మంటల్లో చిక్కుకోవడం వంటి దుర్ఘటనలు జరగకుండా దాదాపుగా తగ్గించవచ్చు.

300 కిలోమీటర్ల రేంజ్ వరకు కొమాకి బ్యాటరీ ప్యాక్ నిర్విరామంగా నడవగలదని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఈ దూరం కొమాకి వెనిస్ మోడల్ కి వర్తిస్తుంది. వేరే మోడల్ కి ఈ రేంజ్ మారే అవకాశముంది. ఇక కొమాకి ఎస్ఈ, టీఎన్95 మోడల్స్ సింగిల్ చార్జ్ పై 180 కిలోమీటర్ల దూరం వెళ్ళగలవని కంపెనీ క్లెయిమ్ చేసింది.