
ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava త్వరలో Lava Agni 2s డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న Lava Agni 2 కి మాంచి డిమాండ్, రివ్యూలు ఉన్నాయి. వాల్యూ ఫర్ మనీ ఆండ్రాయిడ్ ఫోన్ గా Lava Agni 2 కి పేరుంది. ఇక కంపెనీ Lava Agni 2s ని ఈ ఏడాది ఆఖర్లో భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే Lava Agni 2s అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Lava Agni 2s
- Lava Agni 2s డివైజ్ స్పెసిఫికేషన్స్ దాదాపుగా Lava Agni 2 ని పోలి ఉంటాయని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.
- త్వరలోనే లాంచ్ ఉండనున్న నేపథ్యంలో రానున్న కొన్ని రోజుల్లో అఫీషియల్ టీజర్స్ విడుదలవుతాయని అంచనా వేస్తున్నారు.
- ప్రాసెసర్ మినహా Lava Agni 2s స్పెసిఫికేషన్స్ Lava Agni 2 మాదిరే ఉండే అవకాశం ఉంది.
- ఇప్పటికే మార్కెట్ లో ఉన్న Lava Agni 2 ధర రూ.21,999 గా ఉంది. దీని కంటే కాస్త తక్కువ ధరతో Lava Agni 2s మార్కెట్ లోకి రానుంది.
- Lava Agni 2s లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది.
Lava Agni 2 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Lava Agni 2 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Lava Agni 2 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడనున్నారు. అయితే Lava Agni 2s లో వేరే చిప్సెట్ ఉంటుందని సమాచారం.
- ర్యామ్, స్టోరేజీ: Lava Agni 2 లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. 16జిబి వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంది.
- కెమెరా: Lava Agni 2 లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- సాఫ్ట్వేర్: Lava Agni 2 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్స్ తో పాటు, మూడు నెలలకు ఒకసారి సెక్యూరిటీ అప్డేట్స్ ని 3 ఏళ్ళ పాటు కంపెనీ అందించనుంది.
- బ్యాటరీ, చార్జింగ్: Lava Agni 2 లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











