
ప్రేమికులు తమ ప్రేమను చూపేందుకు ఎన్నో మార్గాలను ప్రయత్నించవచ్చు. కానీ అది తప్పుడు మార్గమైతే చిక్కులు తప్పవు. ఎంతోమంది వినూత్న రీతిలో తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు జరిగిన ఒక ఘటన మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. వివరాల్లోకి వెళ్దాం పదండి. టర్కీకి చెందిన ఒక ప్రేమికుడు రూ.25 లక్షలు విలువజేసే 33 ఐఫోన్లను దొంగిలించాడు. ఇదంతా తన ప్రేయసికి బహుమతి ఇచ్చేందుకే చేయడం గమనార్హం. పూర్తి కథేంటో తెలుసుకుందాం పదండి.
ప్రేయసి కోసం 33 ఐఫోన్లను దొంగిలించిన వ్యక్తి
ఈ షాకింగ్ న్యూస్ టర్కీ నుంచి వచ్చింది. ప్రేమికుడు అజీమ్ ఒక కొరియర్ కంపెనీలో పని చేస్తున్నాడు. రీసెంట్ గా ఒక మాల్ లోని టెక్నాలజీ సెంటర్ కి ఆపిల్ ఐఫోన్లను డెలివరీ చేసే ఆర్డర్ అజీమ్ కి వచ్చింది. ఇక అంతే, ఇదే అదనుగా తన ప్లాన్ ని అమలు చేశాడు అజీమ్.
ఐఫోన్ డెలివరీ ఆర్డరును తీసుకున్న వెంటనే తన విధుల నుంచి బయటకు వచ్చేశాడు అజీమ్. అయితే ఐఫోన్స్ గల పార్సెల్ ని డెలివరీ చేయకుండా వాటిని దొంగిలించాడు. ఈ ఐఫోన్ల విలువ 30,000 డాలర్లు ఉంటుందని అంచనా. అంటే భారతీయ కరెన్సీలో రూ.24,97,800 అని చెప్పవచ్చు.
దొంగిలించిన iPhones అమ్మి కారు కొనుగోలు
ఖరీదైన 33 ఐఫోన్లను దొంగిలించిన తర్వాత, అజీమ్ వాటిని అమ్మడం మొదలుపెట్టాడు. చాలా తక్కువ సమయంలో ఎన్నో ఐఫోన్లను అమ్మేసి వచ్చిన డబ్బుతో ఒక కారు కొన్నాడు. ఆ కారుని అజీమ్ తన గర్ల్‌ఫ్రెండ్ కి బహుమతిగా ఇచ్చాడు. టర్కీలో ఐఫోన్ల ధర చాలా ఎక్కువ. భారతీయ కరెన్సీలో చూస్తే, అక్కడ iPhone 15 Pro Max ఫోన్ ధర దాదాపు రూ.2,70,000 గా ఉంటుంది.
కానీ, ఈ ప్రేమ జంట ఆనందం ఎంతోకాలం నిలవలేదు. తమకి చెందిన 33 ఐఫోన్లు మిస్ అయ్యాయని తెలుసుకున్న సదరు ఐఫోన్ స్టోర్ ఎంక్వైరీ మొదలుపెట్టింది. డెలివరీ పర్సన్ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజీ చూశాక, పోలీసులు అజీమ్ ఇంటిని సోదా చేసి దొంగిలించిన ఐఫోన్ల నుంచి 5 డివైజెస్ ని రికవరీ చేశారు. అలాగే ఐఫోన్లను అమ్మగా వచ్చిన డబ్బుతో కొన్న కారుని కూడా రికవరీ చేశారు. అమ్ముడు కానీ 5 ఐఫోన్లతో పాటు కారుని పోలీసులు సీజ్ చేశారు.
Source: 91mobiles Hindi











