12GB ర్యామ్‌తో చైనాలో లాంచైన Vivo Y33t; ధర తక్కువే!

Highlights

  • చైనాలో లాంచ్ అయిన Vivo Y33t
  • 6.56-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • Vivo Y33t ధర రూ.8,500

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనా మార్కెట్ లో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y33t పేరుతో చైనీస్ మార్కెట్ లోకి ఈ డివైజ్ ఎంట్రీ ఇచ్చింది. తక్కువ ధరలో వచ్చిన ఈ డివైజ్ ఇదివరకే వేరే స్పెసిఫికేషన్స్ తో భారత్ లో లాంచ్ అయ్యింది. Vivo Y33t ఫోన్ 6జిబి ర్యామ్, 6.56-ఇంచ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. మరి Vivo Y33t చైనా వేరియంట్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం.

Vivo Y33t ధర, కలర్ ఆప్షన్స్

చైనీస్ మార్కెట్ లో Vivo Y33t డివైజ్ 6జిబి+128జిబి సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధరను అక్కడ 749 యువాన్లుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీలో రూ.8,500 అనుకోవచ్చు. Vivo Y33t డివైజ్ వైల్డ్ గ్రీన్, క్రిస్టల్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. నేటి నుంచి చైనాలో JD.COM ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Vivo Y33t స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y33t లో 6.56-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y33t లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు. ఇదొక మిడ్-రేంజ్ చిప్సెట్.
  • మెమొరీ: Vivo Y33t లో 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 6జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి మొత్తం 12జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Vivo Y33t లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo Y33t లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo Y33t డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y33t లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఫోన్ 186 గ్రాముల బరువు ఉంది.
Previous article12GB ర్యామ్, 50MP కెమెరాతో చైనాలో లాంచైన Vivo Y78t
Next articleLava Blaze 2 5G డివైజ్‌ని టీజ్ చేసిన కంపెనీ
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.