
ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఒక కొత్త కర్వ్డ్ డిస్ప్లే ఫోన్‌ని లాంచ్ చేయబోతోంది. Lava Blaze Curve 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా లావా సంస్థ ఈ ఫోన్ లాంచ్ తేదీని ఖరారు చేసింది. Lava Blaze Curve 5G లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి.
Lava Blaze Curve 5G ఇండియా లాంచ్ వివరాలు
- మార్చి 5న భారతీయ మార్కెట్ లో Lava Blaze Curve 5G లాంచ్ అవుతోంది. ఈ లాంచ్ ఈవెంట్‌ని లావా ఇండియా యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ మరియు యూట్యూబ్ చానల్ పై చూడవచ్చు.
- అలాగే షాపింగ్ సైట్ అమెజాన్ పై కూడా Lava Blaze Curve 5G లాంచ్‌ని ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించవచ్చు.
- Lava Blaze Curve 5G డివైజ్ లాంచ్ ఈవెంట్ మార్చి 5న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.
Get ready for the Curve-O-lutionary launch of the year at one of the most majestic locations in India.
Blaze Curve: Launching on 5th March, 12 PM#BlazeCurve #LavaBlazeCurve #CurveOlution #LavaMobiles #ProudlyIndian pic.twitter.com/2dR0cd4rxH
— Lava Mobiles (@LavaMobile) February 27, 2024
Lava Blaze Curve 5G ధర (లీక్)
- Lava Blaze Curve 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో భారత్ లో లాంచ్ అవుతోంది.
- Lava Blaze Curve 5G 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది.
- Lava Blaze Curve 5G 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.18,999 గా ఉంది.
- Lava Blaze Curve 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ తో మార్కెట్ లోకి లాంచ్ కానుంది.
Lava Blaze Curve 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Lava Blaze Curve 5G లో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Lava Blaze Curve 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది. ఈ చిప్సెట్ 5,50,000 అంటుటు స్కోర్ సాధించింది.
- కెమెరా: Lava Blaze Curve 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
- బ్యాటరీ: Lava Blaze Curve 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
- కనెక్టివిటీ: Lava Blaze Curve 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.











