
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నేడు భారతీయ మార్కెట్ లో Spark 20C ని లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలనుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్ గా నిలిచే అవకాశం ఉంది. Tecno Spark 20C డివైజ్ లో 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి ఈ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Tecno Spark 20C ధర
Tecno Spark 20C స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
Tecno Spark 20C డివైజ్ ధరను భారత్ లో రూ.8,999 గా నిర్ణయించారు. ఫోన్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.
మార్చి 5వ తేదీ నుంచి షాపింగ్ సైట్ అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
Tecno Spark 20C డివైజ్ గ్రావిటీ బ్లాక్, మిస్టరీ వైట్, మ్యాజిక్ స్కిన్ గ్రీన్ మరియు అల్పెన్‌గ్లో గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Tecno Spark 20C స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Tecno Spark 20C లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Tecno Spark 20C లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ ఉంది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్. గరిష్ట క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.
- ఓఎస్: Tecno Spark 20C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20C డివైజ్ 8జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఈ ఫోన్ 128జిబి ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
- కెమెరా: Tecno Spark 20C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: Tecno Spark 20C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 50 నిమిషాల్లో ఈ ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
- కనెక్టివిటీ: Tecno Spark 20C లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Tecno Spark 20C లో ఐపీఎక్స్2 రేటింగ్, డ్యూయల్ డీటీఎస్ స్టీరియో స్పీకర్స్, హైపర్‌ఇంజిన్ 2.0 ఉన్నాయి.











