భారతదేశపు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Lava త్వరలో ఒక కర్వ్డ్ డిస్ప్లే ఫోన్‌ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియాలో టీజర్ ద్వారా తెలియజేసింది. EALGVUZ5CBER అనే ఆంగ్ల అక్షరాలను పోస్ట్ చేసి, ఏమి రాబోతుందో ఊహించగలరా? అని అడిగింది. ఆ అక్షరాలను డీకోడ్ చేస్తే Blaze Curve 5G అని వస్తోంది. దీని బట్టి, త్వరలోనే లావా నుంచి Lava Blaze Curve 5G డివైజ్ రానుందని స్పష్టమవుతోంది. అయితే లాంచ్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. త్వరలోనే లాంచ్ కి సంబంధించిన వివరాలను, స్పెసిఫికేషన్స్ ని కంపెనీ టీజర్ల ద్వారా తెలిపే అవకాశం ఉంది.
త్వరలో లాంచ్ కానున్న Lava Blaze Curve 5G
????????????
Can you guess what is coming? #Lava #ProudlyIndian
— Sunil Raina (@reachraina) January 6, 2024
- Blaze Curve 5G డివైజ్ త్వరలోనే మార్కెట్ లోకి రానుంది.
- Blaze Curve 5G లాంచ్ గురించి లావా సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేసింది.
- EALGVUZ5CBER అనే కోడెడ్ మెసేజ్ ని పోస్ట్ చేసి, ఏంటో చెప్పమని యూజర్లను కోరింది. దీని డీకోడ్ చేస్తే, Blaze Curve 5G అని వస్తోంది. దీంతో త్వరలో ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.
- లావా సంస్థ త్వరలో రాబోవు Blaze Curve 5G గురించి మరే ఇతర వివరాలను షేర్ చేయలేదు. రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.
Blaze Curve 5G ధర (అంచనా)
- Lava Blaze Curve 5G ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
- కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోన్న Lava Blaze Curve 5G కచ్చితంగా యూజర్లను ఆకర్షించే అవకాశం ఉంది.
- Lava Blaze Curve 5G ధర వివరాలు త్వరలోనే అధికార ప్రకటన లేదా లీక్స్ ద్వారా తెలిసే అవకాశం ఉంది.
- ఇటీవలి కాలంలో, కర్వ్డ్ ఫోన్లు భారతీయ మార్కెట్ లోకి చాలానే వచ్చాయి. అయితే రూ.25,000 బడ్జెట్ సెగ్మెంట్ లో మొదటగా Realme సంస్థ Realme 11 Pro డివైజ్ భారత మార్కెట్ లో లాంచ్ అయ్యింది.
- Lava Blaze Curve 5G మరింత చవకగా మార్కెట్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
