
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ నేడు భారత్ లో Realme 11 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. గత నెలలో ఈ సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు భారత మార్కెట్ లోకి ప్రవేశించింది. ఈ లైనప్ లో Realme 11 Pro 5G మరియు Realme 11 Pro+ 5G మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండు ఫోన్లు కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Realme 11 Pro 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 108ఎంపి ప్రైమరీ కెమెరాతో వచ్చింది. ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
భారత్ లో Realme 11 Pro 5G ధర, లభ్యత
భారత్ లో Realme 11 Pro 5G మూడు వేరియంట్స్ లో లభ్యం కానుంది. 8జిబి ర్యామ్ + 128జిబి వేరియంట్ ధరను రూ.23,999 గా నిర్ణయించారు. 8జిబి+256జిబి మోడల్ ధర రూ.24,999 గా ఉంది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.27,999 గా ఉంది.
కలర్ ఆప్షన్స్
Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ సన్‌రైజ్ బీజ్, ఒయాసిస్ గ్రీన్ మరియు ఆస్ట్రల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ హ్యాండ్సెట్ సేల్ జూన్ 16 నుంచి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ అధికార వెబ్ సైట్ ద్వారా మొదలవుతుంది. రియల్మీ ఎర్లీ యాక్సెస్ సేల్ ద్వారా నేడు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫోన్ ని యూజర్లు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ పై రూ.2,000 వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Realme 11 Pro 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Realme 11 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 93.65 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Realme 11 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 జీపీయూ వినియోగించారు.
- ర్యామ్, స్టోరేజీ: Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 12జిబి ర్యామ్ మరియు 512జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
- కెమెరా: Realme 11 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ 6పి లెన్స్ మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Realme 11 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
- ఓఎస్: Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ ఉంది.











