లీకైన Moto G 5G (2024) రెండర్ ఇమేజ్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం

Highlights

  • 2024 లో లాంచ్ కానున్న Moto G 5G
  • 6.5-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్
  • త్వరలో లాంచ్ తేదీన వెల్లడయ్యే ఛాన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ప్రతీ ఏడాది జీ-సిరీస్ లో ఫోన్లను లాంచ్ చేస్తుంటుంది. గతేడాది Moto G 5G (2023) డివైజ్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చిన మోటోరోలా ఇప్పుడు Moto G 5G (2024) ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు అర్థమవుతోంది. తాజాగా Moto G 5G (2024) యొక్క రెండర్ ఇమేజ్ లీక్ అయ్యింది. దీంతో ఫోన్ డిజైన్ రివీల్ అయ్యింది. సరే, ఓసారి Moto G 5G (2024) డిజైన్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.

Moto G 5G (2024) రెండర్స్ (లీక్)

  • Moto G 5G (2024) ఫోన్ రెండర్ ఇమేజెస్ మరియు 360 డిగ్రీ వీడియోని OnLeaks సౌజన్యంతో MySmartPrice వెబ్‌సైట్ రివీల్ చేసింది.
  • Moto G 5G (2024) లో పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఉంది. లీక్ ప్రకారం, ఈ డివైజ్ 6.5-ఇంచ్ డిస్ప్లేతో వస్తున్నట్లు సమాచారం.
  • బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • ఫోన్ కి కుడివైపున వాల్యూమ్, పవర్ బటన్స్ ఉన్నాయి. సిమ్ ట్రే ఎడమవైపున ఉంది. బాటమ్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.
  • Moto G 5G (2024) డివైజ్ 164.4 మి.మీ పొడవు, 74.9 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం ఉంటుంది.

Moto G 5G (2023) స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G 5G (2023) లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G 5G (2023) లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్ వాడారు. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G 5G (2023) లో 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Moto G 5G (2023) లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Moto G 5G (2023) లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Previous articleలీకైన iQOO Neo 9, Neo 9 Pro పూర్తి స్పెసిఫికేషన్స్; డిసెంబర్ 27న లాంచ్!
Next article8GB ర్యామ్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Lava Storm 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.