Love Today మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, స్ట్రీమింగ్ పార్ట్నర్

హైలైట్స్

  • తమిళనాడులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ టుడే సినిమా
  • గతవారం తెలుగులో అదే పేరుతో విడుదల, సూపర్బ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోన్న మూవీ
  • ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ ని ఖరారు చేసుకున్న Love Today

టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలను కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. కథ బాగుంటే చాలు అందులో నటీనటులు ఎవరనేది మన తెలుగు వారు పట్టించుకోరు. మంచి సినిమాలను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. ఇదివరకు ఎన్నో చిన్న, పెద్ద తమిళ సినిమాలు తెలుగునాట బంపర్ హిట్ అయ్యాయి. అలా ఆయా నటులకు టాలీవుడ్ లో కూడా క్రేజ్ పెరిగింది. తాజాగా తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయి వచ్చిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు రేపుతోంది. మరి ఆ చిత్ర విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. అలాగే ఆ సినిమా ఓటీటీ అప్డేట్స్ ని కూడా అందిస్తున్నాం. ఓసారి కన్నేయండి.

ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో రూపొందిన లవ్ టుడే అనే చిత్రం గత వారం తెలుగు రాష్ట్రాల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు దక్కాయి. అంతే కాదు, థియేటర్లలో ఆక్యుపెన్సీ కూడా ఆశించిన స్థాయిలో ఉంది. దీంతో వీకెండ్ వసూళ్ళు బాగా నమోదవుతున్నాయి.

లవ్ టుడే చిత్రం తెలుగులో తొలిరోజున రూ.2 కోట్లను వసూలు చేసింది. ప్రస్తుత ట్రెండ్స్ ని పరిశీలిస్తే పూర్తి థియేట్రికల్ రన్ ముగిసేసరికి లవ్ టుడే రూ.15 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి తాను పెట్టిన పెట్టుబడి పై చాలా రెట్లు అధిక లాభాలు రావడం గ్యారెంటీ అనిపిస్తోంది.

Love Today స్ట్రీమింగ్ పార్ట్నర్

ఆధునిక సంబంధాలు ఎలా ఉన్నాయో అన్న విషయాన్ని సినిమాలో చూపిన విధానం బాగుండటంతో, బాక్సాఫీస్ వద్ద చిత్రానికి ప్రేక్షకులు విజయాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో డిసెంబర్ 2 నుంచి తమిళ వర్షన్ స్ట్రీమింగ్ మొదలవుతుంది. ఇక తెలుగు వర్షన్ మాత్రం డిసెంబర్ 25 నుంచి క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

చిత్ర తారాగణం

లవ్ టుడే చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా నటించారు. సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, యోగి బాబు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. హీరోగా చేసిన ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. ఇతనికి నటుడిగా ఇదే తొలి చిత్రం. ఇదివరకు జయం రవితో కోమలి అనే సక్సెస్ఫుల్ సినిమా తీశాడు. రూ.5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో తమిళంలో దాదాపు రూ.100 కోట్లను వసూలు చేసింది. ప్రస్తుతం లవ్ టుడే తెలుగు వర్షన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.