ప్రత్యేకతలు:
* ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ (LPDDR5X RAM)
* స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 100W/150W ఫాస్ట్ ఛార్జింగ్
* జులై 12 న చైనాలో ఎంట్రీ
తాజాగా రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ కు సంబంధించిన ర్యామ్ వివరాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చెబుతున్న దాన్నిబట్టి, రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ LPDDR5X ర్యామ్ తో వస్తుందని తెలుస్తోంది. దీంతో ఫోన్ యొక్క పెర్ఫామెన్స్ పెరగడమే గాక, శక్తి వినియోగం కూడా తగ్గనుంది.
LPDDR5X RAM సపోర్ట్ తో వస్తున్న Realme GT 2 Master Explorer Edition
Realme GT 2 Master Explorer Edition will be powered by Snapdragon 8+ Gen 1 & LPDDR5X ram.
– Snapdragon 8+ Gen 1
– LPDDR5X ✅#realme #realmeGT2ExplorerMasterEdition pic.twitter.com/VGVSR4lF4M— Abhishek Yadav (@yabhishekhd) July 7, 2022
డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో వస్తోన్న తొలి ఫోన్ రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్. దీంతో ఫోన్ యొక్క శక్తి వినియోగం 20 శాతానికి తగ్గనుంది. అలాగే గేమింగ్ పెర్ఫామెన్స్ 30 శాతం మేర పెరగనుంది.
Realme GT 2 Master Explorer Edition స్పెసిఫికేషన్స్
ముందు అనుకున్నట్లుగా, రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండనున్నాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ నిక్షిప్తం చేయబడింది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 100w/150w ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. రియల్ మీ జీటీ 2 మాస్టర్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వస్తోంది.
రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరాను అమర్చారు. అలాగే ఇందులో వెనుకవైపు 50ఎంపి ప్రైమరీ, 50ఎంపి అల్ట్రా వైడ్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ 3.0 స్కిన్ పై రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ ఫోన్ పని చేయనుంది.
