
భారత దేశంలో ఎన్నో వందల భాషలున్నాయి. ఎన్ని భాషలున్నా మన తెలుగుకున్న ప్రత్యేకతే వేరు. ఎంతో సరళమైన, తేలికైన, వినసొంపైన భాష మన తెలుగు భాష. ఏ భాషైనా సరే, అది మనుగడలో ఉండాలంటే, ప్రజలు మాట్లాడాలి, రాయాలి తమ తర్వాతి తరం వారికి నేర్పించాలి. ఈ ప్రక్రియ కొనసాగినంత కాలం ఏ భాషైనా సరే ఏన్నేళ్ళు గడిచినా మనుగడలోనే ఉంటుంది.
తమ తమ భాషల యొక్క గొప్పతనం చెప్పుకోవడం మంచి విషయమే. కానీ, ఆయా భాషలను మాట్లాడుతూ, వాడుతూ వాటికున్న ప్రాధాన్యతను తగ్గకుండా చూసుకోవడం ఎంతో అవసరం. నిత్యం మనం వాడే ఫోన్ ద్వారా లేదా కంప్యూటర్ ద్వారా సోషల్ మీడియా సైట్స్ పై మన మాతృ భాషను వినియోగిస్తే చాలా బాగుంటుంది కదా. ఇప్పటికే ఎంతోమంది తేట తెలుగులో తమ సోషల్ మీడియా పోస్ట్ లను పెడుతున్నారు. మరికొందరు తెలుగులోనే చాట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎంతో ఆనందించదగిన శుభపరిణామాలు.
సరే, ఈ ఆర్టికల్ లో మనం స్మార్ట్ ఫోన్, మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లలో తెలుగు లో ఎలా రాయాలో తెలుసుకుందాం.
తెలుగులో రాయడం ఎలా?
తెలుగులో రాసేందుకు తెలుగు కీ బోర్డ్ అందుబాటులో ఉంది. మీకు కనీసం తెలుగు టైపింగ్ తెలియకపోయినా తేలిగ్గా తెలుగులో రాయవచ్చు. నేడు ఎన్నో ఆన్‌లైన్-ఆఫ్‌లైన్ టూల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో మీరు ఈజీగా తెలుగులో రాయవచ్చు. మొబైల్ ఫోన్ లో తెలుగులో రాయడమెలాగో ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం.
- మొబైల్ ఫోన్ పై తెలుగులో రాయడం ఎలా
- కంప్యూటర్ పై తెలుగులో రాయడం ఎలా
- గూగుల్ ఇన్‌పుట్ టూల్స్ ఎక్స్‌టెన్షన్
- గూగుల్ ఇన్‌పుట్ వెబ్ బ్రౌజర్
మొబైల్ ఫోన్ లో తెలుగులో రాయడమెలా?
మొబైల్ ఫోన్ లో తెలుగులో రాసేందుకు, మీరు గూగుల్ యొక్క జీ-బోర్డ్ ని మీ ఫోన్ లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టెప్స్ ఫాలో అవ్వండి.
స్టెప్ 1: తొలుత మీరు, మీ ఆండ్రాయిడ్ ఫోన్ పై జీ-బోర్డ్ కీబోర్డ్ ని ప్లేస్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేయండి.
స్టెప్ 2: కీబోర్డ్ ని ఇన్‌స్టాల్ చేశాక, ఫోన్ సెట్టింగ్స్ లో మీరు ‘లాంగ్వేజీ మరియు ఇన్‌పుట్’ సెక్షన్ కి వెళ్ళాలి.
స్టెప్ 3: కీబోర్డ్ మరియు ఇన్‌పుట్ ఆప్షన్ లో కనిపించే కరెంట్ కీబోర్డ్ అనే ఆప్షన్ పై మీటండి. ఇక్కడ మీకు కీబోర్డ్ ని ఎంచుకునే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు జీ-బోర్డ్ ని ఎంచుకోండి.
స్టెప్ 4: కీబోర్డ్ ని ఎంచుకున్న తర్వాత, మీరు జీ-బోర్డ్ సెట్టింగ్ కి వెళ్ళి, అక్కడ తెలుగు భాషను ఎంచుకోవాలి. ఇక్కడ మీరు ఏబీసీ-తెలుగు అనే కీబోర్డ్ ఆప్షన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
అంతే, ఇప్పుడు మీ కీబోర్డ్ తెలుగులోకి మారిపోయింది. ఏదైనా వ్యాఖ్యాన్ని తెలుగులో రాయాలంటే మీరు ఇంగ్లీషు అక్షరాలను వాడి, తెలుగులో రాయవచ్చు. ఉదాహరణ: రాముడు ఇంటికి వచ్చాడు; దీన్ని మీరు ‘Ramudu intiki vachaadu’ అని రాయవచ్చు. అది తెలుగులోకి మారిపోతుంది. ఈ విధంగా మీరు మీ మొబైల్ ఫోన్ లో తెలుగులో టైప్ చేయవచ్చు.
కంప్యూటర్ లో తెలుగులో ఎలా రాయాలి?
ఆన్‌లైన్ ద్వారా కంప్యూటర్ లో తెలుగులో రాసేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ, ఆఫ్‌లైన్ లో తెలుగులో రాసేందుకు మీరు తెలుగు టైపింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకోసం ఆన్‌లైన్ ద్వారా తెలుగులో ఎలా రాయాలో తెలియజేస్తాం. అందుకోసం మీరు గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ లేదా గూగుల్ ఇన్‌పుట్ టూల్ ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
గూగుల్ ఇన్‌పుట్ టూల్స్ ఎక్స్‌టెన్షన్
మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ లో మీకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉన్నట్లయితే, అప్పుడు మీరు గూగుల్ ఇన్‌పుట్ టూల్ ఎక్స్‌టెన్షన్ ని ఇన్‌స్టాల్ చేసుకుని క్రోమ్ బ్రౌజర్ లో తెలుగులో టైప్ చేయవచ్చు. ఇక్కడ స్టెప్స్ ని ఫాలో అవ్వండి.
స్టెప్ 1: మీరు క్రోబ్ బ్రౌజర్ పై క్రోమ్ వెబ్ స్టోర్ ని ఓపెన్ చేయండి.
స్టెప్ 2: ఇప్పుడు మీరు గూగుల్ ఇన్‌పుట్ టూల్ ని సెర్చ్ బార్ లో సెర్చ్ చేయండి. అప్పుడు దానిపై ట్యాప్ చేసి క్రోమ్ కి యాడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
స్టెప్ 3: ఇప్పుడు మీరు బ్రౌజర్ పైన ఎక్స్‌టెన్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత గూగుల్ ఇన్‌పుట్ టూల్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎక్స్‌టెన్షన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీని తర్వాత మీరు తెలుగు ని ఎంచుకోవాలి. ఇప్పుడు పేజీని మూసేయండి.
స్టెప్ 4: ఇప్పుడు మీరు మరోసారి గూగుల్ ఇన్‌పుట్ టూల్ ని మరోసారి క్లిక్ చేసి పిన్ చేయాలి. ఇప్పుడు మీరు తేలికగా గూగుల్ క్రోమ్ పై తెలుగులో టైప్ చేయగలరు. తెలుగులో టైప్ చేసే ముందు మీరు క్రోమ్ ఎక్స్‌టెన్షన్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
గూగుల్ ఇన్‌పుట్ వెబ్ బ్రౌజర్
గూగుల్ ఇన్‌పుట్ వెబ్ బ్రౌజర్ పై కూడా మీరు తెలుగులో టైప్ చేయవచ్చు. మీరు ఏదైనా బ్రౌజర్ లో ఈ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మీకు గూగుల్ ఇన్‌పుట్ బ్రౌజర్ పై తెలుగులో ఎలా టైప్ చేయాలో సమాచారం అందిస్తున్నాం.
స్టెప్ 1: మీరు ముందుగా మీ బ్రౌజర్ లో https://www.google.com/inputtools/ వెబ్ సైట్ ని తెరవాలి.
స్టెప్ 2: ఇప్పుడు మీరు ట్రై ఇట్ ఔట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో రైటింగ్ ప్యాన్ తెరుచుకుంటుంది.
స్టెప్ 3: ఇక్కడ డ్రాప్ డౌన్ మెను లో తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇక అంతే మీరు తెలుగులో తేలికగా రాసేయవచ్చు. మీరు రాసిన వెంటనే ఆ టెక్స్ట్ ని కాపీ చేసుకోవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












