
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు గ్లోబల్ మార్కెట్ లో Moto G 5G (2024) అనే డివైజ్ ని లాంచ్ చేసింది. మొదటగా అమెరికా మరియు కెనెడా దేశాల్లో ఈ ఫోన్ సేల్‌కి రానుంది. త్వరలోనే Moto G 5G (2024) భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఓసారి మోటో జీ 5జీ (2024) డివైజ్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Moto G 5G (2024) ధర
Moto G 5G (2024) స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధర 200 యూఎస్ డాలర్లు (సుమారు రూ.16,500) గా ఉంది.
రానున్న రోజుల్లో Moto G 5G (2024) డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా దీనికి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది.
Moto G 5G (2024) స్మార్ట్‌ఫోన్‌ని సేజ్ గ్రీన్ కలర్ ఆప్షన్ లో కొనుగోలు చేయవచ్చు.
Moto G 5G (2024) స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Moto G 5G (2024) లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Moto G 5G (2024) లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ ఉంది.
- ఓఎస్: Moto G 5G (2024) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ర్యామ్, స్టోరేజీ: Moto G 5G (2024) 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో యూజర్ కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
- కెమెరా: Moto G 5G (2024) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Moto G 5G (2024) లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Moto G 5G (2024) లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, డాల్బీ అట్మాస్, డ్యూయల్ స్పీకర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.











