హైలైట్స్
- లో-బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Moto G Play (2022) పై పని చేస్తున్న మోటోరోలా
- ఒప్పో, వివో, రియల్మీ కంపెనీలకు బడ్జెట్ సెగ్మెంట్ లో గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యం
- మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్, 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 3జిబి ర్యామ్ తో రానున్న Moto G Play (2022)

తక్కువ బడ్జెట్ లో ఓ ఫోన్ ని తీసుకురావాలని ప్రముఖ కంపెనీ మోటోరోలా ప్లాన్ చేస్తోంది. త్వరలోనే Moto G Play (2022) అనే ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. రియల్మీ, ఒప్పో, రెడ్మీ, వివో సంస్థలకు రూ.8,000 బడ్జెట్ సెగ్మెంట్ లో గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యంగా మోటోరోలా దూసుకొస్తోంది. Moto G Play (2022) ఫోన్ ని అందరికీ అందుబాటు ధరలో, చాలా తక్కువ ప్రైస్ తో మార్కెట్ లో లాంచ్ చేసే అవకావం ఉంది.
Moto G Play (2022) లుక్, డిజైన్
Moto G Play (2022) డిజైన్, లుక్ గురించి తెలుసుకుందాం. Moto G Play (2022) స్మార్ట్ ఫోన్ పంచ్-హోల్ స్టైల్ డిస్ప్లే తో రానుంది. ఇది ఫ్లాట్ స్క్రీన్, బెజెల్-లెస్ సైడ్స్, మందపాటి బాటమ్ చిన్ ని కలిగి ఉంటుంది. స్క్రీన్ కి టాప్ లో సెంటర్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్ కి పై భాగాన స్పీకర్ ఉంది.
Moto G Play (2022) బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ సెటప్ లో మూడు లెన్సెస్ కూడా నిలువుగా ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. రియర్ ప్యానెల్ పై మోటోరోలా లోగో ఉంది. ఫోన్ కి కుడివైపు ప్యానెల్ పైన వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. ఎడమవైపు ప్యానెల్ పైన సిమ్ స్లాట్ ఉంది. బాటమ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.
Moto G Play (2022) స్పెసిఫికేషన్స్
ఇప్పుడు Moto G Play (2022) స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. Moto G Play (2022) మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్ ని కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ ని వాడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ పై పని చేస్తుంది. Moto G Play (2022) 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీని కలిగి ఉండనుంది.
Moto G Play (2022) ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో 16 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్, 2 మెగా పిక్సెల్ డెప్త్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5 మెగా పిక్సెల్ కెమెరాని అమర్చారు. Moto G Play (2022) లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











