
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన ‘జీ ప్లే’ సిరీస్ ని ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా Moto G Play (2024) డివైజ్ ని లాంచ్ చేసింది. యూఎస్ మార్కెట్ లో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. Moto G Play (2024) స్మార్ట్‌ఫోన్ లో 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, వర్చువల్ ర్యామ్, 6.5-ఇంచ్ భారీ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Moto G Play (2024) యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Moto G Play (2024) ధర
- Moto G Play (2024) డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది.
- ఈ వేరియంట్ ధరను యూఎస్ లో 149 డాలర్లు (సుమారు రూ.12,384) గా నిర్ణయించారు.
- Moto G Play (2024) డివైజ్ ఫిబ్రవరి 8 నుంచి యూఎస్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
- Moto G Play (2024) స్మార్ట్‌ఫోన్ డీప్ ఇండిగో సింగిల్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది.
Moto G Play (2024) స్పెసిఫికేషన్స్
Moto G Play (2024) లో స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్, 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.
- డిస్ప్లే: Moto G Play (2024) లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 1600*720) పిక్సెల్స్ రెజుల్యూషన్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Moto G Play (2024) లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Moto G Play (2024) లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 6జిబి వర్చువల్ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.
- కెమెరా: Moto G Play (2024) లో 50ఎంపి సింగిల్ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: Moto G Play (2024) లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Moto G Play (2024) డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Moto G Play (2024) లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











