
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఇటీవలె Reno 11, Reno 11 Pro ఫోన్లను భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఇప్పుడు మరొక Reno సిరీస్ ఫోన్ ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. OPPO Reno 11F ఫిబ్రవరి 24వ తేదీన ఇండోనేషియాలో లాంచ్ కానుందని సమాచారం. ఇప్పటికే అక్కడ OPPO Reno 11F ప్రీ-ఆర్డర్లు మొదలైనట్లు తెలుస్తోంది.
అయితే OPPO Reno 11F భారతీయ మార్కెట్ లో OPPO F25 అనే పేరుతో రీబ్రాండ్ అయ్యి రానుందని తాజాగా టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపారు. OPPO F25 ఫోన్ భారత్ లో వచ్చే నెలలో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
ఫిబ్రవరిలో లాంచ్ కానున్న OPPO F25
- ఫిబ్రవరి 24న ఇండోనేషియాలో OPPO Reno 11F లాంచ్ కానుంది. అదే ఫోన్ భారతీయ మార్కెట్ లో OPPO F25 పేరుతో విడుదలవ్వనుంది.
- గతేడాది మే నెలలో లాంచైన OPPO F23 కి సక్సెసర్ గా OPPO F25 డివైజ్ మార్కెట్ లోకి రానుంది.
- ఇండోనేషియాలో OPPO Reno 11F ప్రీ ఆర్డర్లు ఇప్పటికే మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
- ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తన X ఖాతాపై OPPO F25 లాంచ్ టైమ్‌లైన్ షేర్ చేశారు.
- OPPO Reno 11F భారత్ లో OPPO F25 పేరుతో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
Exclusive ⭐
Oppo Reno 11 F will launch as Oppo F25 in India next month.#Oppo #OppoReno11F #OppoF25 pic.twitter.com/KtYj2z6gQX
— Abhishek Yadav (@yabhishekhd) January 16, 2024
OPPO F25 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: OPPO F25 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 10-బిట్ కలర్ సపోర్ట్ ఉంటాయి.
- ప్రాసెసర్: OPPO F25 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
- ర్యామ్, స్టోరేజీ: OPPO F25 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 6జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేయనుంది.
- కెమెరా: OPPO F25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఒమ్నివిజన్64బి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి10 మ్యాక్రో కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ఓఎస్: OPPO F25 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: OPPO F25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: OPPO F25 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ65 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.











